https://oktelugu.com/

హోం లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. లక్షన్నర పన్ను మినహాయింపు..?

దేశంలో హోం లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర లోన్లతో పోల్చి చూస్తే దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీతో కస్టమర్లకు హోం లోన్లను ఇస్తున్నాయి. అయితే ట్యాక్స్ చెల్లించే వాళ్లు హోం లోన్లను తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. హోం లోన్లు తీసుకున్న వాళ్లు ఏకంగా లక్షన్నర రూపాయల పన్ను మిహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. Also Read: ఉద్యోగులకు శుభవార్త […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2020 / 01:49 PM IST
    Follow us on


    దేశంలో హోం లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర లోన్లతో పోల్చి చూస్తే దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీతో కస్టమర్లకు హోం లోన్లను ఇస్తున్నాయి. అయితే ట్యాక్స్ చెల్లించే వాళ్లు హోం లోన్లను తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. హోం లోన్లు తీసుకున్న వాళ్లు ఏకంగా లక్షన్నర రూపాయల పన్ను మిహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.

    Also Read: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన గూగుల్.. ఇకపై మూడు రోజులే..?

    కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువు ఇప్పటికే పొడిగించిన సంగతి తెలిసిందే. ట్యాక్స్ చెల్లించే వాళ్లు ఈ నెల 31వ తేదీలోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంది. తక్కువ సమయం మాత్రమే ఉండటంతో చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. హోం తీసుకున్న వాళ్లు ఐటీఆర్ ఫైలింగ్ చేస్తుంటే సెక్షన్ 80ఈఈఏ ప్రకారం లక్షన్నర రూపాయల ప్రయోజనాలను పొందవచ్చు.

    Also Read: మంగళవారం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా… అయితే జాగ్రత్త!

    గతేడాది కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకుంది. 45 లక్షల వరకు స్టాంపు డ్యూటీ ఉండటంతో పాటు ఇల్లు లేని, కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవాళ్లు ఈ మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే 2019 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సంవత్సరం మార్చి 31వ తేదీలోపు హోం లోన్ తీసుకున్న వాళ్లు మాత్రమే ఈ పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    లక్షన్నర కంటే ఎక్కువ వడ్డీ చెల్లించి ఉంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. దేశంలో ఇళ్ల కొనుగోళ్లను పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం కొన్నేళ్ల క్రితం సెక్షన్ 80ఈఈఏను అమలులోకి తీసుకురాగా ఈ సెక్షన్ ద్వారా కేంద్రం ఇల్లు కొనుగోలు చేసిన వాళ్లను పలు ప్రయోజనాలను కల్పిస్తోంది.