Mahesh Babu sister Manjula: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి సొంత టాలెంట్ ఉన్నోళ్లు మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తారు. ఇక హీరోగా అయిన, డైరెక్టర్ గా అయిన, ప్రొడ్యూసర్ గా అయిన తన సత్తా చాటుకోవాలి అంటే సినిమాల మీద ఉన్న ఇష్టం, సినిమా కోసం పడే కష్టం మాత్రమే ఇక్కడ వాళ్లను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం కెరియర్ మొదట్లో కొంతవరకు ఒడిదుడుకులను ఎదుర్కున్నప్పటికి ‘ఒక్కడు’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో దగ్గరైపోయాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం… ఇక మహేష్ బాబు వాళ్ళ అక్క అయిన మంజుల సైతం పలు సినిమాల్లో నటించింది. అయినప్పటికి నటిగా తనకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ప్రొడ్యూసర్ గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాకి మొదట పూరి జగన్నాథ్ మంజులానే ఇద్దరు ప్రొడ్యూసర్స్… కానీ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అప్పటివరకు మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ వేరని ఈ సినిమా పూర్తిస్థాయిలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంది. నిజానికి మహేష్ బాబుని ఇలా జనాలు యాక్సెప్ట్ చేయరని ఈ సినిమాని చూసిన చాలామంది చెప్పారు. దాంతో కృష్ణ, మహేష్ బాబు ఒక వంతుకు సందిగ్ధ పరిస్థితిలో పడ్డారు.
ఇక ఇలాంటి క్రమంలోనే అప్పటివరకు ఆ సినిమాకి మంజుల పూరి జగన్నాథ్ ఇద్దరు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఇక ఆ సినిమా ఆడదని తెలిసిన వెంటనే మహేష్ బాబు మంజులతో పూరి జగన్నాథ్ ని ఆ సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పారట. దాంతో మంజుల నేను ప్రొడ్యూసర్ గా డ్రాప్ అవుతున్నాను…
మీరు ఒక్కరే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉండండి అంటూ చెప్పిందట. దాంతో పూరి జగన్నాథ్ చేసేదేమీలేక ఆమె పెట్టిన డబ్బులను ఆమెకు తిరిగిచ్చేశాడట. ఇక సినిమా ఆడదు అనే ఉద్దేశ్యంతోనే పూరి జగన్నాథ్ మూవీని రిలీజ్ చేశాడు. ఫస్ట్ వీక్ డివైడ్ టాక్ తో రన్ అయినప్పటికి సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది…
ఈ సినిమా రిజల్ట్ చూసిన మంజులా కొంత వరకు బాధపడ్డారని ఆ తర్వాత వాళ్ళ సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి. మొత్తానికైతే మంజుల ‘పోకిరి’ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉంటే ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగేది. మహేష్ బాబు వల్లే తను ప్రొడ్యూసర్ కాలేక పోయిందని ఆమె పలు సందర్భాల్లో తెలియజేయడం విశేషం…