Allu Arjun Lokesh Kanagaraj Movie Updates: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే చాలు ఎప్పటికైనా వాళ్లకు ఒక ఛాన్స్ వస్తుంది. దాంతో వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకొని టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశం కూడా దక్కుతుంది. కెరియర్ స్టార్టింగ్ లో అల్లు అర్జున్ సైతం ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయన లుక్స్ మీద తీవ్రమైన విమర్శలైతే వచ్చాయి. ఆ తర్వాత ‘ఆర్య’ సినిమాతో యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. స్టైలిష్ స్టార్ గా మారిన ఆయన సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ 3 హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా ఉంటుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటి? అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
నిజానికి అల్లు అర్జున్ ఛాలెంజింగ్ క్యారెక్టర్లను తీసుకుని అందులో తనను తాను మెప్పించగలననే ఒక కాన్ఫిడెంట్ తో ముందుకు సాగుతుంటాడు. ప్రేక్షకులను సైతం తన పెర్ఫార్మెన్స్ తో కట్ట పడడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో చేసే సినిమాలో ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి…
ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని ఇప్పటివరకు ఎవరు పోషించనటువంటి ఒక డిఫరెంట్ కోణంలో ఈ పాత్ర ఉండటం వల్లే అల్లు అర్జున్ ఆ పాత్ర ఒప్పుకున్నాడని కొంతమంది చెబుతున్నారు. నిజానికి ఇండియాలో ఎవరు చేయనిది మనం చేసి చూపించాలనే ఒక తపనతో అల్లు అర్జున్ ఉంటాడు. అందుకే ‘దేశముదురు’ సినిమాలో మొదటిసారిగా సిక్స్ ప్యాక్ చేశాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ ట్రాన్స్ జండర్ గా ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ని ఇస్తాడు అనేది తెలియాల్సి ఉంది. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ను లోకేష్ కనకరాజు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడట…