Hero Surya : తెలుగు ఆడియన్స్ మీద హీరో సూర్య ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడా..? ఇన్ని ఏళ్ళు అయినా ఎందుకు లెక్క చెయ్యట్లేదు!

ప్రెస్ మీట్ తర్వాత సూర్య ఎమోషనల్ గా అభిమానులతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By: Vicky, Updated On : October 25, 2024 2:27 pm

Hero Surya

Follow us on

Hero Surya :  గత కొన్నేళ్ల నుండి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకుంటున్న తమిళ హీరో సూర్య, ఇప్పుడు ‘కంగువ’ చిత్రంతో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. 2022 వ సంవత్సరంలో ‘ఈటీ’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో సుదీర్ఘ విరామం తీసుకొని భారీ బడ్జెట్ తో ‘కంగువ’ చిత్రం చేసాడు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా సూర్య, హీరోయిన్ దిశా పటాని తో పాటుగా దర్శకుడు శివ, నిర్మాతలు కూడా ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. ప్రొమోషన్స్ లో భాగంగా నిన్న మూవీ టీం హైదరాబాద్ లోని AMB మాల్ కి విచ్చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత సూర్య ఎమోషనల్ గా అభిమానులతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘మీ రక్తం..నా రక్తం వేరు కాదు..మన అందరిలో ఉన్నది ఒకే రక్తం..తెలుగు ఆడియన్స్ నా మీద చూపించే ప్రేమకి నాకు మాటలు రావడం లేదు. రెండేళ్లు అయ్యింది నేను సినిమా చేసి. ఈ గ్యాప్ లో అభిమానులు ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ ని రీ రిలీజ్ చేసి భారీ వసూళ్లను రప్పించేలా చేసారు. ఆరోజు ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని చూసి నా కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. మీరు చూపించే ప్రేమకి నేను బాద్యుడిని. మీకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని నేను ఈ ‘కంగువ’ చిత్రం ద్వారా అందించబోతున్నాను’ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు. ఏంటి సూర్య ఇంత తెలుగు మాట్లాడాడా? అని మీ అందరికీ ఆశ్చర్యం వేసింది కదూ!..అంత అదృష్టం మనకి లేదు లేండి. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడితే మేము తెలుగులో అనువదించి చెప్తున్నాము. సూర్య ని తెలుగు ఆడియన్స్ ఎంతో ఇష్టపడుతారు అనే విషయం ఆయనకి తెలుసు.

దాదాపుగా రెండు దశాబ్దాల నుండి ఆయన్ని మన ఆడియన్స్ తమ సొంత తెలుగు హీరోలాగా భావించి ఆదరిస్తున్నారు. అలాంటి ప్రేమ చూపిస్తున్నప్పుడు తెలుగు నేర్చుకోవాలి అనే జ్ఞానం సూర్య కి లేకుండా పోయిందా?. సూర్య తమ్ముడు కార్తీని కూడా మన ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరించారు. దానికి బదులుగా ఆయన తెలుగు లో స్పష్టంగా నేర్చుకొని, మన తెలుగు హీరోలకంటే అద్భుతంగా మాట్లాడుతాడు. తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ గొప్పవాళ్ళు వంటి వ్యాఖ్యలు కూడా చేసాడు. సూర్య లాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. తన తమ్ముడిని చూసి అయినా తెలుగు నేర్చుకోవాల్సింది. అది తెలుగు భాషకు ఆయన ఇచ్చే గౌరవం. కానీ రెండు దశాబ్దాలు దాటినా ఇంకా తెలుగు మాట్లాడకపోవడం, సరిగ్గా సినిమా విడుదల సమయంలో తెలుగు ఆడియన్స్ నా అన్నదమ్ములు, నా ప్రాణం అంటూ మాట్లాడితే నమ్మేయడానికి జనాలు అంత అమాయకులు కాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.