Nani rejects Mirai Movie: ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి క్వాలిటీ సినిమాని చూడబోతున్నాము అనే నమ్మకాన్ని కలిగించింది ఈ సినిమా ట్రైలర్. దానికి తేజ సజ్జ ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచేలా చేశాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే, ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అదేంటో ఒకసారి చూద్దాం.
ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) ఈ కథని మూడేళ్ళ క్రితమే సిద్ధం చేసుకున్నాడట. కానీ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న తనకు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడానికి అప్పట్లో కొంతమంది హీరోలు ధైర్యం చేయలేదట. కానీ నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కార్తీక్ ఘట్టమనేని తో కలిసి ఈ ‘మిరాయ్’ చిత్రాన్ని చేయడానికి సిద్దపడ్డాడట. కానీ రెమ్యూనరేషన్ విషయం లో నాని కి నిర్మాత ఒక లెక్క కుదరకపోవడం తో ఈ సినిమా నుండి ఆయన తప్పుకున్నాడట. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా తన సినిమాటోగ్రఫీ పనులు చేసుకుంటున్న కార్తీక్ ఘట్టమనేని కి, ‘హనుమాన్’ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న తేజ సజ్జ కనిపించాడు. వెంటనే అతన్ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించి, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించి, ఇంత దూరం తీసుకొచ్చారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
తేజ సజ్జ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేసాడు. ముఖ్యంగా ట్రైలర్ లో మనకి కనపడే షాట్స్ VFX కాదట. అత్యధిక శాతం లైవ్ లొకేషన్స్ కి వెళ్లిన తీసిన షూటింగ్ అట అది. దానికి సంబందించిన మేకింగ్ వీడియో ని కూడా నిన్న విడుదల చేయగా, అది కాస్త ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేసింది. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా మంచు మనోజ్ నటించిన సంగతి తెలిసిందే. ఆయన క్యారక్టర్ కూడా సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఉంటుందని,మనోజ్ చాలా అద్భుతంగా నటించాడంటూ తేజ సజ్జ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.