Domestic Exports : దేశీయ ఎగుమతులు డౌన్.. జూలైలో ఎంత క్షీణించాయంటే..?

మూడు నెలలుగా పెరుగుతూ వచ్చిన భారత ఎగుమతుల రేషియో జూలైలో మాత్రం తగ్గింది. బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ నుంచి ఈమేరకు ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.

Written By: NARESH, Updated On : August 15, 2024 4:19 pm

Domestic Exports Down

Follow us on

Domestic Exports : దేశీయ ఎగుమతులు డౌన్ అయ్యాయి. వాటిలో సుమారు 1.20 శాతం క్షీణత కనిపించింది. 2024 జూలైలో 33.98 బిలియన్ డాలర్లకు మాత్రమే ఇది పరిమితమైంది. అంతకుముందు జూన్ నెలలో ఇది 35.20 బిలియన్ డాలర్లు గా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ గణంకాల ప్రకారం.. దేశంలో గతంతో పోలిస్తే దిగుమతుల శాతం మాత్రం పెరుగుతూ వచ్చింది. సుమారు 7042 శాతం దిగుమతులు జూలైలో పెరిగాయి. ఇవి 57.48 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఇక ఎలా చూసుకుంటే ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య వ్యత్యాసం భారీగా నమోదైంది. సుమారు 23.50 బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఏర్పడింది. ఇక ఇది గత జూన్ లో కేవలం 20.98 బిలియన్ డాలర్లే. ఇక గతేడాది జూలైలో ఇదే వ్యత్యాసం 19.30 శాతంగా ఉంది. ఇక దేశంలో చమురు వాడకం పెరిగింది. గతంతో పోలిస్తే చమురు దిగుమతులు పెరిగాయి. ఇది రెండింటి మధ్య వ్యత్యాసానికి కారణంగా కనిపిస్తున్నది. గతం కంటే క్రూడ్ అయిల్ దిగుమతి 17.44 శాతం పెరిగింది. అంటే సుమారు 13.87 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు విదేశాలకు పెట్రోలియ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. ప్రస్తుతం 22015 శాతం తగ్గి 5.22 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈ ఏడాది భారతీయ సరుకుల ఎగుమతులు గతేడాది నమోదైన 778 బిలియన్ డాలర్లను దాటేస్తాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ చెబుతున్నది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు చూసుకుంటే దేశీయ వ్యాపార ఎగుమతులు పెరిగాయి. ఇది 4.15 శాతం వృద్ధితో 144.12 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఇక దిగుమతులు కూడా 7.57 శఆతం పెరిగి 229.70 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక గతేడాది ఇదే వ్యవధిలో75.15 డాలర్లు గా మాత్రమే నమోదైంది. అయితే సేవారంగ ఎగుమతులు గతంలో పోలిస్తే 106.79 బిలియన్ డాలర్ల నుంచి 117.35 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు సమాచారం. ఇక దిగుమతులు 62.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ఇక బంగారం దిగుమతులు10.65 శాతం తగ్గి, 3.13 బిలియన్ డాలర్లు, వెండి 439 శాతం పైకి చేరి 165.74 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎలక్ర్టానిక్ పరికరాల ఎగుమతులు 37.31 శాతం పెరిగాయి. ఔషధాలు, ఇంజినీరింగ్ ఎగుమతులు కూడా పెరిగాయి. ఇవి వరుసగా 8.36, 3.66 శాతంగా ఉన్నాయి. బియ్యం, జీడిపప్పు, సముద్ర ఉత్పత్తులు, నగలు, రసాయనాలు, దారం, బట్టలు తదితర ఎగుమతులు తగ్గాయి.

అయితే ఈ ఎగుమతులు తగ్గడానికి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఎర్రసముద్రం లో వివాదాలు, ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా కారణంగా కనిపిస్తున్నది. అయితే దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భరత్ వాల్ ఇలా స్పందించారు. గత నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులు భారీగా తగ్గాయి. ఇక ప్రస్తుతం మార్కెట్ లోధరల పతనం, అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం, దేశీయ వినియోగంలో పెరుగదల దీనికి కారణంగా కనిపిస్తున్నది.

ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, చైనా మార్కెట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఈ కామర్స్ మార్కెట్ లోని ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. భారత్ నుంచి ఎగుమతుల పెంపునకు కావాల్సిన చర్యలన్నింటినీ వాణిజ్య శాఖ తీసుకుంటున్నది. రానున్న రోజుల్లో ఎగుమతుల్లో పెరుగుదల కనిపిస్తుందని అనుకుంటున్నా.