Sunder Pichai : ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఈ సంస్థకు ప్రస్తుతం తెలుగు మూలాలు ఉన్న సుందర్ పిచాయ్ సీఈవోగా ఉన్నారు. గూగుల్‌తోపాటు ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. అనేక ప్రయోగాలతో సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నారు. లాభాలు గడిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఇప్పుడు క్రికెట్‌పై ఆసక్తి చూపుతున్నారు. భారత్‌తోని ఐపీఎల్, ఇంగ్లండ్‌లోని కౌంటీల తరహాలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇంటర్నల్ టోర్నీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సికికాన్ వ్యాలీ ఎగ్క్యిటివ్‌ల కన్సార్టియంలో చేరారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్(Microsoft) సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్(Adob) సీఈవో శంతన్ నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ లేదా అండన్ స్పిరిట్ టీమ్‌ల కోసం 80 మిలియన్ పౌండ్లు(97 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.806.1 కోట్లు) బిడ్ వేస్తుంది. ఈ కన్సార్టియంకు(Consartiam) పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ది హండ్రెడ్ ఎనిమిది జట్లలో ప్రైవేటు పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీఈ)చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.
100 బాల్ ఫార్మాట్‌తో ది హండ్రెడ్..
ఇక టీ20 తరహాలోనే 100 బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. విజయవతంగా నడుస్తుంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ఈ జట్లు యూకేలోని ఒక్కో ప్రధాన నగరానికి ప్రతినిధ్యం వహిస్తాయి. ఈ పోటీలను స్కై(Sky) స్పోర్ట్స్, బీబీసీ(BBC) ప్రసారం చేస్తాయి.
టెక్ కంపెనీ సీఈఓల ఆసక్తి
సుందర్ పిచాయ్‌కు క్రికెట్‌పై ఆసక్తి ఉన్నవిషయం అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథలు క్రికెట్‌పై ఆసక్తిగా ఉంటూ దానిని మరింత చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగ ఈసీబీ ప్రతీ జట్టులో 49 శాతం వాటాను విక్రియించాలని చూస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.