https://oktelugu.com/

Agent Movie: ‘ఏజెంట్’ సినిమాని తప్పించుకున్న స్టార్ హీరో అతనేనా..? లక్ అంటే ఇదే!

వాస్తవానికి స్క్రిప్ట్ పరంగా ఈ చిత్రం చాలా పటిష్టమైనదే, కానీ టేకింగ్ విషయం లోనే పూర్తిగా దెబ్బ పడింది, పాపం అఖిల్ కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.ఒకవేళ ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసి ఉంటే ఆయన కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచేది, చివరి నిమిషం లో నిర్ణయం మార్చుకోవడం తో ఒక పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ నుండి బయటపడినందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : April 29, 2023 / 12:57 PM IST
    Follow us on

    Agent Movie: అక్కినేని అఖిల్ తన కెరీర్ లో ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ‘ఏజెంట్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్ చేతిలో అఖిల్ పడేలోపు, కచ్చితంగా ఆయనని స్టార్ లీగ్ లోకి కూర్చోబెడుతాడు అనే నమ్మకం తో ఉండేవారు.

    కానీ సినిమా షూటింగ్ సమయం లో సురేందర్ రెడ్డి కి మరియు నిర్మాత అనిల్ సుంకర కి మధ్య గొడవలు రావడం, సురేందర్ రెడ్డి సినిమా మధ్యలోనే వదిలి వెళ్లిపోవడం వల్ల ఈ మూవీ కథ రాసిన వక్కంతం వంశీ డైరెక్ట్ చేసాడట.అందుకే ఫలితం మొత్తం తారుమారైంది.కానీ మూవీ టైటిల్స్ పడేటప్పుడు డైరెక్టర్ టైటిల్ సురేందర్ రెడ్డి అని పడడం వల్ల ఈ చిత్రం ఫ్లాప్ బాధ్యత మొత్తం సురేందర్ రెడ్డి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ చిత్రం తో ఆయన కెరీర్ క్లోజ్ అయ్యిందనే అనుకోవచ్చు.

    అయితే ఈ చిత్రాన్ని తొలుత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీద్దాం అనుకున్నాడు ,అప్పట్లో రామ్ చరణ్ ఈ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు కూడా, అయితే ఆయన ఒప్పుకున్న కమిట్మెంట్స్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడం తో ఈ ప్రాజెక్ట్ ని తన తమ్ముడి లాంటి అఖిల్ కి ఇచ్చేసాడు.