Trivikram sentiment: ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ సెంటిమెంట్లను బ్రేక్ చేయడం వల్ల వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదటి నుంచి వాళ్ళు పెట్టుకున్న సెంటిమెంట్ ని బలంగా నమ్మాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే రైటర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారి భారీ విజయాలను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన ఇమేజ్ కొంతవరకు తగ్గింది…
కానీ ఇప్పుడు వెంకటేష్ తో మరోసారి సక్సెస్ ని సాధించి పూర్తి ఫామ్ లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక వెంకటేష్ తో ఆయన ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. కేవలం ఆరు నెలల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్స్ లో అ అనే లెటర్ ని ఎక్కువగా వాడుతూ వచ్చాడు.
అతడు, అత్తారింటికి దారేది, అఆ, అలా వైకుంఠ పురంలో అనే సినిమాలైతే చేశాడు. సినిమా మొదటి లెటర్ అ తో స్టార్ట్ అయితే తనకు అదృష్టం కలిసి వచ్చిందనే ఉద్దేశంతోనే ఆయన అదే లెటర్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలని చూస్తూ ఉంటాడు. త్రివిక్రమ్ ఆ అనే టైటిల్ మీద వచ్చిన సినిమాలు 100% సక్సెస్ ని సాధించాయి. కాబట్టి ఆయన అదే లెటర్ ని రిపీట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు.
ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం అనేది కామన్ అయిపోయింది. దానివల్ల ఆయన సినిమా టైటిల్ మొదటి అక్షరం అ తో స్టార్ట్ అవుతోంది. అందులో ఇద్దరు హీరోయిన్ ఉంటారు. ఇదే సెంటిమెంట్ ఇప్పటికి ఫాలో అవుతున్నాడు. ఇక వెంకటేష్ సినిమా విషయంలో కూడా ఆయన ఆ సెంటిమెంట్ వాడాడు… అందుకే ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ని ఫిక్స్ చేశాడు…