Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి ఎనలేని కీర్తి వచ్చి పడింది. ఒక నటుడిగా గొప్ప స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ చరణ్ తన తండ్రి చిరంజీవి మాట జవదాటడు. ముఖ్యంగా సినిమాల విషయంలో చిరంజీవి సూచనలు ఫాలో అవుతారట.
కథలు ఎంపికలో మెగాస్టార్ సలహాలు తప్పక పాటిస్తాడట రామ్ చరణ్. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం చిరంజీవి వద్దని హెచ్చరించినా వినలేదట. చిరు మాట కాదని తీసుకున్న సొంత నిర్ణయం వల్ల విమర్శల పాలయ్యాడట. రామ్ చరణ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. చరణ్ ఫస్ట్ మూవీ చిరుత. మొదట్లో కాస్త తడబడ్డా ఆ తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. సొంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు.
మెగా వారసుడు గానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే గతంలో ఓ సినిమా విషయంలో రామ్ చరణ్ తీసుకున్న సొంత నిర్ణయం తిప్పలు తెచ్చిపెట్టింది. చిరంజీవి మాట లెక్కచేయకుండా రామ్ చరణ్ చేసిన ప్రయత్నం విఫలమవడం కావడంతో, ట్రోలింగ్ కి గురయ్యాడు.
చిరంజీవి స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలారు. ఆయనకు కథల విషయంలో ఎంతైనా అవగాహన ఉంటుంది. అందుకే రామ్ చరణ్ కి సినిమాలు ఎంచుకునే విషయంలో గైడ్ చేస్తూ ఉంటారట. ఈ సినిమా చెయ్ ఇది వద్దు అని చెప్తుంటారట. ఈ క్రమంలో తండ్రి వద్దని చెప్పిన సినిమా రామ్ చరణ్ పట్టుబట్టి మరీ చేసాడట. ఆ సినిమా మరేదో కాదు జంజీర్. తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయింది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది.
పూర్వ లఖియా దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కించారు. జంజీర్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఓ పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వాలని చరణ్ భావించారట. అందుకే జంజీర్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే ఈ కథ నీకు సూట్ కాదని చిరంజీవి అన్నారట. ఈ సినిమా వద్దు వదిలేయ్ అని చెప్పినా చరణ్ వినకుండా పట్టుబట్టి చేశాడట. 2013లో భారీ అంచనాల నడుమ విడుదలైన జంజీర్ డిజాస్టర్ అయింది.
జంజీర్ లో రామ్ చరణ్ లుక్, యాక్టింగ్ పై బాలీవుడ్ మీడియా ఓ రేంజ్ లో ట్రోల్ చేసింది. ఆ దెబ్బతో రామ్ చరణ్ రియలైజ్ అయ్యాడట. ఇక అప్పటి నుండి సినిమాల విషయంలో చిరంజీవి మాటను రామ్ చరణ్ తప్పక పాటిస్తాడట. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా కావడం విశేషం.