Chiranjeevi Godfather: మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న మూవీ గాడ్ ఫాదర్..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మార్కెట్ లో మంచి పాజిటివ్ బజ్ ఉంది..ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ తర్వాత ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి..అయితే ట్రైలర్ లో ఉన్న ఏకైక నెగటివ్ పాయింట్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్..మెగాస్టార్ మరియు సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తగట్టు గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఉంటె ఇంకా అద్భుతంగా ఉండేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు..కానీ ట్రైలర్ కట్ లో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని పక్కన పెడితే సినిమా లో మాత్రం థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చింపేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ముఖ్యం గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆరోప్రాణంగా నిలుస్తుందట.

నేడు అనంతపూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ రచయితా రామ జోగయ్య శాస్త్రి గారు కూడా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి తన ప్రసంగం లో ప్రత్యేకించి మాట్లాడారు..ఆయన మాట్లాడుతూ ‘ఇందాక మెగాస్టార్ చిరంజీవి గారితో ఫ్లైట్ లో వస్తున్నప్పుడు థమన్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు..థమన్ నా కెరీర్ లోనే బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడయ్యా..అదిరిపోయింది..చూస్తున్నప్పుడు రోమాలు నిక్కపొడుచుకుంది అని చిరంజీవి గారే నాతో స్వయంగా అన్నారు’ అంటూ రామజోగయ్య శాస్త్రి గారు మాట్లాడారు.

ఇటీవల కాలం లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమాలన్నిటికీ కూడా థమన్ అందించిన మ్యూజిక్ పాత్ర అధికం అనే చెప్పొచ్చు..దానికి ఉదాహరణగా నిలిచినవే భీమ్లా నాయక్ మరియు అఖండ సినిమాలు..ఈ రెండు సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రేపు గాడ్ ఫాదర్ సినిమాకి కూడా అలాంటి మ్యూజిక్ ఉండబోతుంది..అభిమానుల నుండి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.