Megastar Chiranjeevi Speech: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచావ్యాప్తంగా తెలుగు , హిందీ మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న అనంతపురం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు..ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాది గా తరలి వచ్చారు..జోరుగా వర్షం కురుస్తున్నా కూడా లెక్క చెయ్యకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తాన్ని ఆస్వాదించారు..ఉరకలేస్తున్న అభిమానుల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అయ్యారు..వాళ్ళ ఉత్సాహం ని కేరింతలు చూసి మెగాస్టార్ కూడా వర్షం లో తడుస్తూ సుమారు అరగంటసేపు ప్రసంగం ఇచ్చాడు..చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఇంత భావోద్వేగానికి లోనై మాట్లాడుతున్నట్టు అభిమానులకు అనిపించింది..సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన చిరంజీవి గారి స్పీచ్ వీడియో నే తిరుగుతూ ఉంది..ఆయన స్పీచ్ లోని మెయిన్ హైలైట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.

ముందుగా చిరంజీవి గారు నిన్న స్వర్గస్తులైన కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారికి శ్రద్ధాంజలి గట్టిస్తూ..కృష్ణ గారికి మరియు మహేష్ బాబు గారికి సభాముఖంగా సంతాపం వ్యక్తపరిచి ప్రసంగాన్ని ప్రారంబించాడు..వర్షాన్ని చూడగానే చిరంజీవి గారిలో ఉత్సాహం ఉరకలేసింది..నేను ఎప్పుడు సీమ కి వచ్చినా ఈ నెల తడుస్తుందని..వరుణ దేవుడు ఆశీసులు ఇక్కడకి వచ్చినప్పుడల్లా తనకి అందుతూనే ఉంటాయని..రాజకీయ పర్యటన అప్పుడు..ఇంద్ర సినిమా షూటింగ్ అప్పుడు కూడా వర్షం పడిందని చెప్పుకొచ్చారు..ఈ వర్షం గాడ్ ఫాదర్ సినిమాకి శుభసూచికమని చెప్పుకొచ్చారు..ఇక ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ గురించి పేరు పేరున ప్రసంగం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు..అంత పెద్ద మెగాస్టార్ అంత జోరు వానలో అంత మందికి ప్రత్యేకించి కృతఙ్ఞతలు తెలియజెయ్యడం నిజంగా చిరంజీవి గారి గొప్ప మనసుకి నిదర్శనం..కష్టం తో పైకి వచ్చిన మనిషి..కష్టం విలువ తెలిసిన మనిషి కాబట్టి ఆయన అలా మాట్లాడడం లో పెద్ద ఆశ్చర్యం లేదు.
ఇక అక్టోబర్ 5 వ తారీఖున విడుదల అవుతున్న నాగార్జున ‘ఘోస్ట్’ మరియు బెల్లంకొండ గణేష్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ సినిమాలకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసాడు మెగాస్టార్ చిరంజీవి..చిరంజీవి గారు తన మిత్రుడు నాగార్జున గురించి అంత ఆప్యాయంగా మాట్లాడడం అక్కినేని అభిమానులకు ఎంతగానో నచ్చింది..ఆయన మాట్లాడుతూ ‘అక్టోబర్ 5 వ తేదీన నా సోదరుడు,నా మిత్రుడు నా మనసుకి ఎంతో దగ్గరైన ఆత్మీయుడు హీరో గా నటించిన ఘోస్ట్ సినిమా విడుదల అవుతుంది..ఆ సినిమాని కూడా ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆదరించాలి’ అంటూ చిరంజీవి గారు చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఇక అభిమానులను ఆయన ఉద్దేశించి చెప్పిన కొన్ని మాటలు పూనకాలు వచ్చేలా చేసాయి..గడిచిన పదేళ్లలో చిరంజీవి గారు తన ఫాన్స్ గురించి ఇంత ఎమోషనల్ మాట్లాడడం మనం చూసి ఉండము..ఆయన మాట్లాడుతూ ‘అందరూ అంటూ ఉంటారు..చిరంజీవి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఎదిగాడని..కానీ నేను ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యి నిలదొక్కుకోవడానికి కారకులైన కోట్లాది మంది అభిమానులందరూ నాకు గాడ్ ఫాథర్స్’ అంటూ చిరంజీవి ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్నాయి.

నిన్న విడుదలైన ట్రైలర్ కంటే చిరంజీవి గారు చెప్పిన ఈ మాటలు గాడ్ ఫాదర్ సినిమా పై అంచనాలు అమాంతం పెంచేలా చేసాయి..ఇక ప్రసంగం ముగించే సమయం లో ఆయన గాడ్ ఫాదర్ లో చెప్పిన ఒక పొలిటికల్ డైలాగ్ కూడా అభిమానులకు తెగ నచ్చేసింది..ఇలా నిన్న జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న ప్రతి మెగా అభిమానికి అది ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నట్టు అనిపించలేదు..గాడ్ ఫాదర్ విజయోత్సవ సభ లో మెగాస్టార్ చిరంజీవి ఉత్సాహం తో గర్జిస్తున్నట్టు అనిపించింది..మెగా అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా నిన్న చిరంజీవి గారి ప్రసంగం ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇక గాడ్ ఫాదర్ ఓపెనింగ్స్ కి తిరుగేలేదు..ఆచార్య సినిమా ఫ్లాప్ తో దెబ్బ తిన్న సింహం లాగ ఉన్న మెగాస్టార్ చిరంజీవి..గాడ్ ఫాదర్ తో తన రికార్డ్స్ ఆకలి కి ఎన్ని రికార్డ్స్ బాలి అవుతాయో చూడాలి.