Devara : దేవర అనుకున్న టైమ్ కి వస్తున్నాడా..?బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడా..?

ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీయార్ కి ఉన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆయన చేసే ప్రతి సినిమా కోసం అభిమానులు అసక్తిగా ఎదురుచూస్తారు...

Written By: Gopi, Updated On : July 23, 2024 11:25 am
Follow us on

Devara : మన స్టార్ హీరోల నుంచి ఒక సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది అంటే వాళ్ళ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా చాలావరకు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇండియాలో సినిమాకి ఉన్నంత క్రేజ్ ఇంకా దేనికి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అందులోనూ తెలుగులో ఉన్న ప్రేక్షకులు మాత్రం సినిమా చూడకపోతే అసలు ఉండలేరు. వాళ్లకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నప్పటికీ సినిమా అందించే ఎంటర్టైన్మెంట్ వేరే ఏది అందించలేదు. అందుకే మన తెలుగు ఆడియన్స్ మాత్రం సినిమాల కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఫస్టాఫ్ అంతా ఎలక్షన్స్ బిజీలో ముగిసిపోయినప్పటికీ సెకండాఫ్ కోసం ఇప్పుడు చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక మిగిలిన ఐదు నెలల్లో స్టార్ హీరోలు ఎంతమంది బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి వస్తున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ‘దేవర ‘ సినిమాతో సెప్టెంబర్ 27 వ తేదీన బాక్సాఫీస్ రికార్డు లను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నట్టు గా తెలుస్తుంది. నిజానికి ఆగస్టు 15వ తేదీన ‘పుష్ప 2 ‘ సినిమా రావాల్సింది. కానీ ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ చేసిన ప్రచారం వల్ల ఆ సినిమా మీద నెగిటివిటి పెరిగింది.

దానివల్ల సినిమాని డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ సినిమా అప్పుడు కూడా వస్తుంది అనే క్లారిటీ అయితే లేదు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘గేమ్ చేంజర్ ‘ సినిమా ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే శంకర్ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఈ సినిమా కూడా 2025 లోనే రాబోతున్నట్టుగా సమాచారమైతే అందుతుంది. ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇప్పుడప్పుడే రాదు.

ఎందుకంటే అది ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు. సెట్స్ మీదకి వెళ్లి షూటింగ్ జరుపుకొని రిలీజ్ అవ్వాలంటే దాదాపు నాలుగు సంవత్సరాలు సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ రీసెంట్ గా కల్కి సినిమాతో వచ్చి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమాతో వచ్చే అవకాశాలైతే లేవు. పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్స్ సమయం నుంచి పాలిటిక్స్ లో బిజీగా తిరుగుతున్నాడు. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడప్పుడే సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలైతే లేవు.

కాబట్టి ఆయన సినిమా కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు లేవు. ఇక సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ల సినిమాలు కూడా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశలైతే కనిపించడం లేదు. కాబట్టి ఎటు తిరిగి మనకు ఈ ఐదు నెలల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే బాక్సాఫీస్ వద్దకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి దేవర సినిమాతో ఆయన మరోసారి తన పంజా దెబ్బను రుచి చూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీయార్ ఇప్పటికే ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నప్పటికీ అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ కి అంత పెద్దగా క్రెడిట్ అయితే రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో తను ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు…