Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Bro Daddy: ‘బ్రోడాడీ’ సినిమాను చిరంజీవి రిమేక్ చేస్తున్నాడా?

Chiranjeevi Bro Daddy: ‘బ్రోడాడీ’ సినిమాను చిరంజీవి రిమేక్ చేస్తున్నాడా?

Chiranjeevi Bro Daddy: మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరుసగా సేఫ్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకు అంటే వారిద్దరూ కూడా వరుసగా రీమేక్‌లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో సినిమాల ఫాస్ట్ మేకింగ్ కోసమే ఇలా రీమేకులకు వెళ్తున్నారు అనే టాక్ కూడా ఉంది. అయితే ఇలా చెయ్యడం మాత్రం ఇద్దరు స్టార్స్ అభిమానులను రంజింపజేయడం లేదు.

దానికి ముఖ్య కారణం ఇలా రీమేకులు చేసినప్పుడు హీరో స్టార్‌డం, నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు అనుకున్నంతగా కుదరడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ మరో రీమేక్ కోసం వెళుతున్నారనే పుకారు షికారు చేసింది.

అసలు విషయానికి వెళితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా కోసం సైన్ ఇన్ చేసారని, అది మలయాళ బ్లాక్ బస్టర్ ‘బ్రో డాడీ’కి రీమేక్ అని పుకార్లు వచ్చాయి. కీలక పాత్రల కోసం త్రిష, శర్వానంద్‌లు ఎంపికైనట్లు సమాచారం కూడా ఉంది. కానీ తాజా నివేదిక ప్రకారం, చిరు, కళ్యాణ్ కృష్ణల చిత్రం బ్రో డాడీకి రీమేక్ కాదంట. ప్రసన్న కుమార్ రాసిన తక్కువ బడ్జెట్ కథ అని తెలుస్తోంది.

చిరు ఇమేజ్‌కి తగ్గట్టుగా కథను సవరించారని, ఆయన మాస్ అభిమానులను కూడా ఉర్రూతలూగించేలా అన్ని మసాలా దినుసులు జోడించారని అంటున్నారు.

ఇప్పటికే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ 2015లో వచ్చిన అజిత్ నటించిన వేదాళం చిత్రానికి రీమేక్. మరో ఆరు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. దానికి ముఖ్య కారణం కూడా ఈ సినిమా రీమేక్ చిత్రం కావడం. అందుకే మరోసారి చిరంజీవి ఆ తప్పు చేయకూడదు అని నిర్ణయించుకొని బ్రో డాడి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.

చిరంజీవి ఇటీవలి చిత్రాలు గాడ్ ఫాదర్, ఖైదీ నంబర్ 150 రీమేక్‌లు కాగా, పవన్ కళ్యాణ్ BRO, ఉస్తాద్ భగత్ సింగ్, భీమ్లా నాయక్, వకీల్ సాబ్, కాటమరాయుడు, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, తీన్ మార్ కూడా రీమేక్‌లే. మరి, చిరు నిజంగా బ్రో డాడీ రీమేక్‌కి వెళ్లడం లేదా అనేది అఫీషియల్ గా తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version