https://oktelugu.com/

వైరల్: వర్మతో వర్కవుట్ చేసిన అరియానా

ఎప్పుడు వార్తల్లో ఉండే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. తన ఇమేజ్ తో కాకుండా ఇతర విషయాల్లోనే ఆయన ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటారు. ఏదో ఒక విషయంలో ప్రముఖంగా కనిపించడం ఆయనకు రివాజు. తాజాగా అరియానాతో ఆయన బయటకొచ్చారు. నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఏడాది వర్మను ఇంటర్వ్యూ చేసిన అరియానాపై ఆసక్తికర కామెంట్లు చేశారు రాంగోపాల్ వర్మ. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు వెలువడుతున్నాయి. అరియానా ఇంతలా ఫేమస్ కావడానికి ఒకే ఒక […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 3, 2021 / 06:59 PM IST
    Follow us on

    ఎప్పుడు వార్తల్లో ఉండే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. తన ఇమేజ్ తో కాకుండా ఇతర విషయాల్లోనే ఆయన ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటారు. ఏదో ఒక విషయంలో ప్రముఖంగా కనిపించడం ఆయనకు రివాజు. తాజాగా అరియానాతో ఆయన బయటకొచ్చారు. నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఏడాది వర్మను ఇంటర్వ్యూ చేసిన అరియానాపై ఆసక్తికర కామెంట్లు చేశారు రాంగోపాల్ వర్మ. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు వెలువడుతున్నాయి.

    అరియానా ఇంతలా ఫేమస్ కావడానికి ఒకే ఒక కామెంట్ అని చెబుతున్నారు. వర్మ అరియానా తొడల మీద చేసిన వ్యాఖ్యలతోనే వారిద్దరు పాపులర్ అయిపోయారు. దీనికి ఆమె సిగ్గుపడడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అంతకు ముందు ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన అరియానా ఈ ఒక్కఇంటర్వ్యూ తోనే పాపులారిటీ బాగా సంపాదించుకున్నారు.

    ఇంటర్వ్యూ తో వచ్చిన గుర్తింపుతో అరియానా బిగ్ బాస్ షో వరకు వెళ్లింది. వర్మ పుణ్యమా అని అరియానా ఆమె స్టేటస్ పెంచుకుంది. అరియానాకు వర్మ మద్దతు కూడా పలికారు. ఆమెను సపోర్టు చేయాలని ప్రేక్షకులను కోరారు. మామూలుగా అయితే స్పందించని వర్మ అరియానా కోసం కదిలి రావడం గమనార్హం.

    వర్మ,అరియానా బంధంపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మళ్లీ వర్మను కలవలేదు. ఇన్ని రోజులకు సమయం వచ్చింది. అరియానా, వర్మ కలుసుకున్నారు. వర్మను ఇంటర్వ్యూ చేయడానికి అరియానా వెళ్లిందట. ఈ మధ్య వర్మ ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో ఆయన జిమ్ లోనే అరియానా వర్మను ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు సైతం షేర్ చేశారు.