
డేరా సచ్చా సౌదా అధినేత, వివాదాస్పద గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనారోగ్యానికి గురయ్యారు. కడుపులో విపరీతమైన నోప్పి రావడంతో పటిష్ట భద్రత నడుమ పోలీసులు ఆయన్ను పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్స్ కు తరలించారు. ఉదరభాగానికి సీటీస్కాన్ చేయించి, రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించారు. విపరీతమైన నీరసం, రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండడంతో మూడు వారాల క్రితం గుర్మీత్ ఇదే ఆస్పత్రిలో చేరారు. ఓ రాత్రి పాటు ఆయన్ను పరీక్షించిన ఏడుగురు సభ్యుల వైద్య బృందం ఆ తర్వాత డిశ్చార్జి చేసింది.