Anushka Slim Look: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చాలా మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియాలో సినిమాలను చేస్తున్న ప్రతి ఒక్క హీరో తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా కొంతమంది హీరోయిన్లు మాత్రం హీరోలతో పోటీ పడి గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అనుష్క సైతం ప్రస్తుతం భారీ సినిమాలను చేస్తూ గొప్ప క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. పాన్ ఇండియాలో ఆమెకు చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె సినిమాలు చేయడం లేదు. కారణం ఏంటి అంటే ఆమె ఓవర్ వెయిట్ అయ్యారు. అందువల్లే ఆమె ఎక్కువ సినిమాలను చేయడం లేదు.
ఇక రీసెంట్ గా ‘ఘాటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆమె కెరీర్ ఇప్పుడు డైలామా లో పడింది. ఇప్పుడు ఆమెకు అర్జెంటుగా ఒక సక్సెస్ కావాలి. దానికంటే ముందు ఆమె స్లిమ్ అవ్వాలని అనుకుంటుందట. అందుకోసమే ఆమె సర్జరీని చేయించుకోబోతుందంటూ కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందరు ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇప్పుడు అనుష్క సర్జరీ చేయించుకొని స్లిమ్ అయినంత మాత్రానకు ఆమెకు మంచి ఆఫర్స్ వస్తాయా? ఒకవేళ అవకాశాలు వచ్చినప్పటికి పూర్వ వైభవాన్ని అనుభవించేంత సక్సెస్ ను సాధిస్తుందా? లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి…ఇక ఆమె కనక సూపర్ సక్సెస్ లను సాధిస్తే పర్లేదు. కానీ సక్సెస్ లను సాధించకపోతే మాత్రం ఇప్పుడున్న హీరోయిన్ల ముందు తను తేలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది…
ఇక తనతోపాటు ఇండస్ట్రీకి వచ్చిన నయనతార, త్రిష, తమన్నా లాంటి హీరోయిన్స్ ఇప్పటికి సినిమాలను చేస్తూ స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారు… అనుష్క సైతం ఆ రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది…ఒకవేళ ఆమెకి ఇప్పుడు అవకాశాలు వచ్చిన సీనియర్ హీరోల పక్కన చేయాల్సి వస్తోంది తప్ప స్టార్ హీరోలతో అవకాశం వచ్చే ఛాన్సులు లేవనే చెప్పాలి…