రూ.85 వేల వేతనంతో బీఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?   

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంబీబీఎస్ చదివిన వాళ్లకు శుభవార్త చెప్పింది. వేర్వేరు హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న 89 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా జూన్‌ 21 నుంచి 30 వ‌ర‌కు ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.   ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు బీఎస్ఎఫ్ […]

Written By: Navya, Updated On : May 17, 2021 9:08 pm
Follow us on

  1. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంబీబీఎస్ చదివిన వాళ్లకు శుభవార్త చెప్పింది. వేర్వేరు హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న 89 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా జూన్‌ 21 నుంచి 30 వ‌ర‌కు ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

 

ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు బీఎస్ఎఫ్ కాంపోసిట్ హాస్పిట‌ల్ లేదా బీఎస్ఎఫ్ హాస్పిట‌ల్‌ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. https://bsf.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి సందేహాలు ఉన్నా సులువుగా నివృత్తి చేసుకోవచ్చు. మొత్తం 89 పోస్టులలో జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగ ఖాళీలు 62 కాగా స్పెష‌లిస్ట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

 

సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఎంబీబీఎస్‌తోపాటు ఇంట‌ర్న్‌షిప్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 85 వేల రూపాయల వేతనం లభిస్తుంది. ఎంబీబీఎస్ చదివిన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.

 

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటున్న సంగతి తెలిసిందే.