Pushpa 2: The Rule : పుష్ప 2 లో అల్లు అర్జున్ నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడా..? అసలు స్టోరీ ఏంటంటే..?

ఇక తన భార్య అయిన రష్మిక మందాన ద్వారా మళ్లీ మనిషిలా మారి శత్రువులను అంతం చేస్తాడట..ఇక పుష్ప 2 లో మెయిన్ స్టోరీ ఇదే అని సినిమా యూనిట్ ద్వారా మనకు సమాచారం అయితే అందుతుంది...

Written By: NARESH, Updated On : May 1, 2024 9:55 pm

Pushpa Pushpa Song

Follow us on

Pushpa 2: The Rule : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాని కూడా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ గాని, లిరికల్ సాంగ్ గాని చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లను రాబడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సుకుమార్ కూడా ఏది చేసినా సినిమా కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కోసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో సుకుమార్ పుష్ప రాజ్ ను ఒక నియంత లా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే స్మగ్లింగ్ లో ఆయనను మించిన తోపు ఎవరూ లేరు అని పుష్ప టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయి తనే సిస్టం మొత్తాన్ని రూల్ చేసే విధంగా సిచ్ వేశన్స్ ను క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఒకానొక టైమ్ లో పుష్ప ఆగడాలు మరి ఎక్కువ అయిపోయి తన మనుషుల మీదే తను రివేంజ్ తీర్చుకునే స్థాయి దాకా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకరకంగా సినిమా మధ్యలో కొద్దిసేపు పుష్పరాజ్ క్యారెక్టర్ నెగటివ్ షెడ్స్ లోకి మారబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. తనకి అడ్డువచ్చిన వాళ్ళను లేపేయడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాడట… అందులో చాలా మంది అమాయకులు కూడా బలి అవుతూ ఉంటారట..

ఇక ఈ సినిమాలో గర్వం ఎక్కువైపోయిన పుష్ప ఏం చేస్తున్నాడో తనకి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా సిస్టంను మార్చే పని పెట్టుకుంటారట. ఇక తన భార్య అయిన రష్మిక మందాన ద్వారా మళ్లీ మనిషిలా మారి శత్రువులను అంతం చేస్తాడట..ఇక పుష్ప 2 లో మెయిన్ స్టోరీ ఇదే అని సినిమా యూనిట్ ద్వారా మనకు సమాచారం అయితే అందుతుంది…