Tollywood AI Impact: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో పెను మార్పులు వస్తున్నాయి. చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఇలాంటి సందర్భంలోనే ఇక మొదట చేయబోతున్న సినిమాలు విషయంలో మన హీరోలతో పాటు దర్శకులు కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఒక సినిమాని చేసిన చాలా మంది దర్శకులు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలని వాళ్లు కూడా చాలావరకు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సినిమాలను చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టెక్నీషియన్సు వాళ్ళ ఐడెంటిటి ఏమీ లేకుండా పోతుందేమో అనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మహావతర్ నరసింహ సినిమాను ఏఐ లో తీసి 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టారు. ఏఐ ద్వారా కూడా ఎమోషన్స్ పండించొచ్చు అని నిరూపించి చూపించారు. కాబట్టి ఇక మీద రాబోయే రోజుల్లో చాలామంది మేకర్స్ సినిమాలు తీసే అవకాశాలను కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి…
Also Read:‘సలార్’ ని దాటేసిన ‘మహావతార్ నరసింహా’..తదుపరి టార్గెట్ ‘కల్కి’?
మరి ఇలా జరిగితే దర్శకులు సినిమాలను ఎలా చేయాలి అనే దాని మీదనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక ఇదంతా చూసిన కొంతమంది సినిమా మేధావులు మాత్రం అన్ని రకాల సినిమాలను చేయలేము. ఏఐ సినిమాలను చూస్తుంటే అది బొమ్మలను చూసినట్టు ఉంటుంది తప్ప మనుషులు చేసినట్టుగా ఉండదు.
కాబట్టి అది ప్రేక్షకుడికి అంత పెద్దగా నచ్చే అవకాశం లేదని వల్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ ఫ్యూచర్స్ తో వస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టెక్నిషియన్స్ వాళ్ళ కెరియర్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…
Also Read: ‘వార్ 2’ నిర్మాతలను కాపాడిన చిన్న సినిమా..ఇది లేకుంటే పాపం ఏమయ్యేవారో!
చూడాలి మరి ఇక మీదట చేయబోయే సినిమాలతో ఇండస్ట్రీ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది… మొత్తానికైతే ఇక మీదట సినిమాలు చేయబోతున్న మేకర్స్ చాలా జాగ్రత్త గా సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది… ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన కూడా ఏఐ ముందు ఓడిపోవాల్సిన అవసరమైతే ఉంది…