Homeఎంటర్టైన్మెంట్Jr NTR: చిరంజీవి ఎవరో నాకు తెలియదు అన్న ఎన్టీఆర్ కి నాగార్జున ఎలా రియాక్ట్...

Jr NTR: చిరంజీవి ఎవరో నాకు తెలియదు అన్న ఎన్టీఆర్ కి నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా ?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎవరో అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా తారక్ ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్రహీరోగా చలామణీ అవుతున్నారు. స్టార్ స్టేటస్ అందుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. కొమురంభీంగా ఎన్టీఆర్ ఇరగదీశాడని అంటున్నారు.

Jr NTR
Chiranjeevi, Tarak

 

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ తాజాగా ‘తారక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతాకృష్ణ మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బ్లడ్ నుంచి వచ్చినా ఆయనను యాక్టింగ్ విషయంలో అనుకరించలేదని ’ స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో తారక్ ఏకంగా చిరంజీవి ఎవరో తెలియదని అన్నాడని.. ఆ సమయంలో నాగార్జున కొంచెం తగ్గుబాబు అంటూ తారక్ ను కరెక్ట్ చేశాడని గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు.

Jr NTR
Chiru, Ntr, Nag

Also Read: పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?

చిరంజీవి మట్టిలో మాణిక్యమని గీతాకృష్ణ వివరించారు. అయితే ఎన్టీఆర్ అలా చిరంజీవిపై అన్నాడని ఇప్పటికీ తగిన ఆధారాలు లేవని తెలుస్తోంది. తారక్ అన్న వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని.. చిరంజీవి, ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఎప్పుడూ లేవని తెలుసుకోవాలన్నారు. పెద్దలను గౌరవించే విషయంలో తారక్ ముందుంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవిని తారక్ ఇలా అన్నాడని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఇలా ఎప్పుడూ ఎన్టీఆర్ అనలేదని.. చిరంజీవిని గౌరవిస్తాడని పేరుంది. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ తో జతకట్టి నటించిన ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీతో ఎప్పుడూ సాన్నిహిత్యంగా ఉంటాడని చెబుతున్నారు. మరి ఈ వార్త ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది.

Also Read: యాక్షన్ లేని బాలయ్య సినిమా ఏమిటో మీకు తెలుసా ?

Recommended Video:

పవన్ సీఎం అభ్యర్థి, టీడీపీకి షాక్  | BJP Want to Make Pawan Kalyan as AP CM | Janasena BJP Alliance

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] Mehreen Kaur Pirzada: బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కెరీర్ గ్రాఫ్ మొదటి నుంచి మిగిలిన హీరోయిన్స్ కంటే భిన్నంగా వస్తూ ఉంది. అయితే, తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె మాటల్లోనే.. ”మా హీరోయిన్ల జీవితాలు చాలా గందరగోళం. చిత్ర విచిత్రంగా సాగుతాయి. దీనికితోడు సినిమాల్లోని పాత్రలకు తగ్గట్టు లుక్స్‌ మార్చాలి. శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాలి. […]

Comments are closed.

Exit mobile version