Homeఎంటర్టైన్మెంట్JR NTR: ఆ ఇద్దరు డైరెక్టర్లతో ఎన్టీఆర్​ సినిమా.. ఫస్ట్ షూటింగ్​ మొదలయ్యే మూవీ ఏదంటే?

JR NTR: ఆ ఇద్దరు డైరెక్టర్లతో ఎన్టీఆర్​ సినిమా.. ఫస్ట్ షూటింగ్​ మొదలయ్యే మూవీ ఏదంటే?

JR NTR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఈ సినిమాలో తారక్​తో పాటు రామ్​చరణ్​ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్​ చేసుకున్నఈసినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమైంది. ఈ గ్యాప్​ను తారక్​ ఫ్యామిలితో స్పెండ్​ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్​ చేస్తున్నారు. త్వరలోనే మళ్లీ తిరిగి వచ్చి కొరటాలతో సినిమా పట్టాలెక్కించనున్నారు. దీంతో పాటు, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో కలిసి సినిమా చేయనున్నారు. ఈ రెండూ కూడా పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.

jr ntr

తాజాగా, ఈ సినిమాలకు సంబంధించి కొన్ని అప్​డేట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తారక్​ విదేశాల నుంచి తిరిగిరాగానే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొరటాల శివ సినిమాను మొదట పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రశాంత్​నీల్​ ప్రాజెక్టుని అక్టోబరులో స్టార్ట్ చేయనున్నారట. అంతే కాదు, రెండు సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించడమే కాకుండా.. గెటప్స్ లోనూ వేరియేషన్స్ చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారక్​ అభిమానులు ఆనందంలో పండగ చేసుకుంటున్నారు.

Also Read: Naga Chaitanya: జోష్ టూ లవ్ స్టోరీ.. బర్త్ డే బాయ్ నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ చిత్రాలు ఇవే!

మరోవైపు, ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోనూ తారక్​ నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా  నాటు నాటు పాటకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, నవంబరు 26న జనని పేరుతో మరో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Also Read: Acharya: ‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్​డేట్​కు రెడీగా ఉన్నారా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version