https://oktelugu.com/

ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. మొదటిసారి మెగా, ఆనందమూరి కుటుంబాలను కలిపి తెరమీద చూపించబోతున్నారు రాజమౌళి. అస్సలు ఊహించని ఈ కలయికతో ప్రేక్షకులు ఆనందంలో మునిగిపోయారు. రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను జక్కన్న సినిమాలో ఎలా సరిసమానంగా చూపిస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు భీభత్సం సృష్టించాయి. Also Read: తగ్గనంటున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 2, 2020 / 10:15 AM IST
    Follow us on


    రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. మొదటిసారి మెగా, ఆనందమూరి కుటుంబాలను కలిపి తెరమీద చూపించబోతున్నారు రాజమౌళి. అస్సలు ఊహించని ఈ కలయికతో ప్రేక్షకులు ఆనందంలో మునిగిపోయారు. రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను జక్కన్న సినిమాలో ఎలా సరిసమానంగా చూపిస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు భీభత్సం సృష్టించాయి.

    Also Read: తగ్గనంటున్న రాజమౌళి.. స్టార్ హీరోల అభిమానుల్లో టెన్షన్..?

    ఎన్టీఆర్ భీమ్ టీజర్ అయితే పెద్ద వివాదాన్నే లేపింది. కొమురం భీమ్ పాత్రలో తారక్ తల మీద టోపీ పెట్టుకుని ఉండటాన్ని ఆదివాసీలు తీవ్రమైన తప్పిదంగా పరిణగించిన రాజమౌళికి హెచ్చరికలు పంపుతున్నారు. ఎంపీలు కూడ సినిమా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని అంటున్నా రాజమౌళి స్పందించట్లేదు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ చేయనున్న భీమ్ పాత్రకు సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన వార్తా ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో తారక్ పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.

    Also Read: చిరంజీవి సినిమాకు రామ్ చరణే సమస్యా ?

    బ్రిటిష్ యువతి పాత్రలో ఒలీవియా మోరిస్ నటిస్తుండగా ఇంకొక కథానాయిక కూడ ఉందట. జక్కన్న కథలో ఆదివాసీ అమ్మాయి ఒకరు భీమ్ మీద ఆరాధన భావం పెంచుకుంటుందట. ఆ పాత్రలో ప్రముఖ యంగ్ హీరోయిన్ నటించనుందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే చరిత్రలో అసలు సంబంధమే లేని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలుసుకుని ఒకరినొకరు ప్రభావితం చేసుకుంటే ఎలా ఉంటుంది, వారి మానసిక స్థితిగతులు ఎలా ఉండేవి అనే ఫిక్షనల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా కోసం సుమారు 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు నీమాట దానయ్య. వచ్చే ఏడాదిలో చిత్రం విడుదలకానుంది.
    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్