
తిరుమల తిరుపతి దేవస్థానంలో సర్వదర్శనం టోకెన్ల జారీని బోర్టు అధికారులు నిలిపివేయనున్నట్లు సమాచారం. కరోనా తగ్గుతున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో మూడువేల కోటాకు మించి టోకెన్లు జారీ చేస్తున్నా భక్తలు రద్దీ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దేవస్థానంలో కరోనా వైరస్ వ్యాపించి కలకలం రేపింది. భక్తలు ఇలా ఎగబడడంతో కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని భావించిన బోర్డు అధికారులు సర్వదర్శనం టిక్కెట్లను తాతాలికంగా నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.