Mahesh Babu-Namrutha Love Story: టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేర్లు మహేశ్, నమ్రత. ఒక అందమైన కుటుంబం ఎలా ఉండాలి అంటే వెంటనే మహేశ్ కుటుంబం అని చెప్తారేమో. వీరిద్దరూ నటులుగా రాణించిన వారే. మహేశ్ బాబు ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. కాగా నమ్రత సినిమాల్లో నటించడం మానేసి కుటుంబాన్ని, భర్తను చూసుకుంటోంది. భర్తకు సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది.

కాగా ఈరోజు ఈ బ్యూటిఫుల్ కపుల్స్ మ్యారేజ్ డే. ఈ సందర్భంగా వారి ప్రేమ ఎలా చిగురించిందో, ఎలా పెండ్లి జరిగిందో తెలుసుకుందాం. వీరిద్దరూ కలిసి మొదటి సారిగా బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన వంశీ మూవీలో నటించారు. ఇందులో కృష్ణ కూడా యాక్ట్ చేశారు. మొదటి సినిమాతోనే భర్త, మామలతో నటించిందన్న మాట నమ్రత.
వారిద్దరి ప్రేమ గురించి నమ్రత ఓ సందర్భంలో చెప్పింది. తామిద్దరం న్యూజిలాండ్ లో వంశీ మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డట్టు తెలిసిందన్నారు. కానీ ఇద్దరిలో ఎవరు ముందు చెప్పామనే మాట మాత్రం ఇప్పటికీ కన్ ఫ్యూషన్ అనే చెప్పడం ఇక్కడ గమనార్హం. కానీ ఇద్దరి మధ్య బలమైన బంధం ఉండటం వల్లే ఇంత దూరం ప్రయాణించామని చెప్పుకొచ్చింది.
Also Read: జగన్ తో భేటీ మిస్ అయినా ట్రైలర్ తో వచ్చిన మోహన్ బాబు !

కాగా తన మామ కృష్ణ తనను తండ్రి లాగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. అత్త ఇందిరా కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుందట. వారిద్దరి ప్రేమకు వంశీ సినిమానే కారణం అని ఈ రకంగా చెప్పేసింది. అయితే భవిష్యత్ లో వారిద్దరూ కలిసి నటించే ఛాన్స్ మాత్రం లేకపోవచ్చని చెప్పుకొచ్చింది. ఇక మహేశ్, నమ్రత పెండ్లి జరిగి నేటికి సరిగ్గా 17 ఏండ్లు. ఫిబ్రవరి 10న వారిద్దరి మ్యారేజ్ జరిగింది. ఇకపోతే ఇప్పుడు మహేశ్ సర్కారి వారి పాట మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. పెండ్లి తర్వాత నమ్రత సినిమాలు మానేసింది. అయితే మహేశ్ మాత్రం పెండ్లి అయ్యాకే సినిమాల్లో స్టార్ గా ఎదిగాడు. ఇక వీరిద్దరి పిల్లలు గౌతమ్, సితార కూడా సోషల్ మీడియాలో చాలా ఫేమస్.
Also Read: చిరు, మహేష్, ప్రభాస్ లతో భేటీ ఫలితాల జగన్ క్లారిటీ !
[…] […]