https://oktelugu.com/

Siri Lela : ఎవరి సిరి లేళ్ల.. నారా రోహిత్ ని పెళ్లి చేసుకునే ఈమె ఏజ్ ఎంత? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మందికి మంచి ఒపినియన్ అయితే ఉండదు. అందుకే ఇండస్ట్రీ కి రావడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు...కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి క్రేజ్ సంపాదించుకుంటే మాత్రం వాళ్లకు మంచి వాల్యూ ఇస్తు ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 14, 2024 / 11:30 AM IST

    Siri Lella

    Follow us on

    Siri Lela : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నారా రోహిత్… మొదట్లో వరుస సినిమాలు చేస్తూ ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నప్పటికి, ఈ మధ్యలో కొద్ది రోజులు పాటు సినిమాలు చేయకుండా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఎట్టకేలకు రీసెంట్ గా ‘ప్రతినిధి 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ 39 సంవత్సరాల వయసు ఉన్న నార రోహిత్ ఇప్పటివరకు పెళ్లి ప్రస్తావన తీసుకొని రాలేదు. కానీ ప్రతినిధి 2 ఆ సినిమా చేసిన తర్వాత ఆ సినిమా హీరోయిన్ అయిన శిరీష లేళ్లతో తను ప్రేమలో పడ్డాడు… ఎట్టకేలకు అక్టోబర్ 13వ తేదీన వీళ్లిద్దరి నిశ్చితార్థం చాలా అట్టహాసంగా జరిగింది. ఇక వీళ్ళ నిశ్చితార్థం జరగడానికి శిరీష లేళ్ల పెళ్లికి ఎలా ఒప్పుకుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

    ఇక ప్రతినిధి 2 సమయంలో శిరీష్ లేళ్ల నారా రోహిత్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరి అది ప్రేమకు దారి తీసింది. దాంతో నారా రోహిత్ వాళ్ల పెద్దమ్మా అయిన భువనేశ్వరికి ఈ విషయాన్ని చెప్పడం తో ఆమె శిరీష ఫ్యామిలీతో మాట్లాడారు. ఇక దాంతో శిరీష వాళ్ళ ఫ్యామిలీ కూడా నారా ఫ్యామిలీ ఇంటికి బంధువులు కావడాన్ని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని వాళ్ళు కూడా ఓకే చేశారు. అసలు మొత్తానికైతే శిరీష సినిమా ఇండస్ట్రీ రావడమే కాకుండా నారా వారి ఇంటికి కూడా కోడలుగా మారుతుండటం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే నారా రోహిత్ ఏజ్ 39 కాగా, శిరీష ఏజ్ 28…వీళ్లిద్దరి మధ్య 11 సంవత్సరాల ఏజ్ గ్యాప్ అయితే ఉంది…

    ఇక కరీంనగర్ కి చెందిన శిరీష హైదరాబాద్ లో డిగ్రీ వరకు చదువుకుంది. ఇక అక్కడి నుంచి మాస్టర్స్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఇక అక్కడ ఉన్నప్పుడే షార్ట్ ఫిలిమ్స్ చేయడం, డబ్ స్మాష్ లు చేయడం లాంటివి చేస్తూ తనకంటూ ఒక మంచి క్రేజ్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడి తను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నానని చెప్పింది. అయితే మొదట వాళ్ళ పేరెంట్స్ కంగారు పడ్డారు. సినిమా ఇండస్ట్రీతో మనకు సంబంధం లేదు. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు లేరు. ఎందుకు ఇబ్బంది అని చెప్పారట. దాంతో శిరీష నా అంతట నేను ఒక రెండు సంవత్సరాలపాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తాను. మీకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయను… ఇండస్ట్రీ లో కూడా చాలా హానెస్ట్ గా ఉంటాను.

    అవకాశాలు రాకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ వదిలేసి నా పని నేను చేసుకుంటాను అంతే తప్ప అసలు మీకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయనని చెప్పడంతో వాళ్ల పేరెంట్స్ కూడా కన్విన్స్ అయి సినిమా ఇండస్ట్రీ కి తను రావడానికి ప్రోత్సహించారు. ఇక అప్పుడు జర్నలిస్ట్ మూర్తి నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమా చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళను కలవడం తో ఆ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది… ఇక ఎట్టకెలకు నారా రోహిత్ శిరీష ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగిందనే చెప్పాలి…