Mega 154: మెగాస్టార్ చిరంజీవి జోరు ముందు కుర్ర హీరోలు కూడా నిలబడలేకపోతున్నారు. మిగతా స్టార్స్ ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా సమయం తీసుకుంటుంటే… చిరంజీవి మాత్రం నెలల వ్యవధిలో చిత్రాలు విడుదల చేస్తున్నారు. ఆచార్య విడుదలైన ఆరు నెలల్లోపే గాడ్ ఫాదర్ అంటూ థియేటర్స్ లో దిగారు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్లు దుమ్ముదులుపుతుంది. వరల్డ్ వైడ్ వంద కోట్ల మార్క్ చేరుకున్న గాడ్ ఫాదర్… రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకెళుతోంది. ఓవర్సీస్ లో గాడ్ ఫాదర్ మరింత ఆదరణ దక్కించుకోవడం విశేషం.

కాగా సంక్రాంతికి చిరు మరో చిత్రం సిద్ధం చేస్తున్నారట. ఆయన హీరోగా ప్రస్తుతం రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ దర్శకుడిగా మెగా 154 తెరకెక్కుతుంది. వీటిలో మెగా 154 ముందుగా పూర్తి చేసి విడుదల చేస్తారట. 2023 సంక్రాంతి బరిలో నిలుపుతారట. ఈ చిత్రాన్ని త్వరిత గతిన పూర్తి చేసే పనిలో చిరంజీవి నిమగ్నమయ్యారట.
అదే సమయంలో దీపావళి నుండి ప్రమోషన్స్ షురూ చేస్తారట. దీపావళి కానుకగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టీజర్ విడుదల అనంతరం సాంగ్స్ విడుదల చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారట. గాడ్ ఫాదర్ విజయం నేపథ్యంలో మెగా 154 మూవీపై భారీ హైప్ ఏర్పడటం ఖాయం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మెగా 154 ఉంటుందట. ఇటీవల గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దర్శకుడు బాబీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే కథలో చిరంజీవి ఊరమాస్ రోల్ ట్రై చేస్తున్నారు. ఆయన ప్రీ లుక్ ముఠామేస్త్రి సినిమాను తలపిస్తుంది. కాగా మాస్ మహారాజ్ రవితేజ ఈ మూవీలో నటించడం విశేషం. ఆయన పోలీస్ పాత్ర చేస్తున్నారని, చిరుతో ఆయన సన్నివేశాలు దుమ్మురేపుతాయని అంటున్నారు. వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ మూవీ హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నారు.