Homeఅప్పటి ముచ్చట్లుAkkineni Nageswara Rao : అక్కినేనితో ఛాన్స్ వస్తే చేయవా ఏమిటి ?

Akkineni Nageswara Rao : అక్కినేనితో ఛాన్స్ వస్తే చేయవా ఏమిటి ?

Akkineni Nageshwara RaoAkkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు గారు (Akkineni Nageswara Rao) ‘గోపాలకృష్ణుడు’ (Gopala Krishna) అనే సినిమా చేస్తున్న రోజులు అవి, ఆ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయడంతో ఆ సినిమా పై అందరి ఆసక్తి పెరిగింది. పైగా అక్కినేనిది గోపాలకృష్ణుడి పాత్ర. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు కొంటె పాత్రలకు పెట్టింది పేరు. ఆయన అభిమానులు అక్కినేని మళ్ళీ అలాంటి పాత్రలు చేయాలని ఆశ పడుతున్న రోజులు అవి. అందుకే, ‘గోపాలకృష్ణుడు’ సినిమాలో రోమియా పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో అక్కినేని వెంటనే అంగీకరించారు.

పైగా చాలా రోజుల తర్వాత అమ్మాయిల వెంటపడుతూ, డ్యూయెట్లు పాడుకునే పాత్ర అక్కినేనిది. అందుకే ఆయన ఆ పాత్రలో లీనం అయిపోయారు. ఎంతైనా హుషారైన పాత్ర కావడం, స్టెప్స్ కూడా మంచి కిక్ ఇచ్చేలా వేశారు. ఇక నాగేశ్వరరావుగారు పక్కన జయసుధను తీసుకున్నారు. ఆమె కూడా అక్కినేనికి పోటీ పడి మరీ నటించింది.

మొత్తానికి అక్కినేని – కోదండరామిరెడ్డి కలయిక పై క్రేజ్ పెరిగింది. అందుకే, గోపాలకృష్ణుడు సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే.. ఈ కలయికలో తానూ మరో సినిమా చేయబోతున్నట్లు బుచ్చిరెడ్డి గ్రాండ్ గా అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ విషయం దర్శకుడు కోదండరామిరెడ్డికి తెలియదు.

ఆ సినిమాకి సంబంధించి పేపర్లో న్యూస్‌ వచ్చింది. పేపర్లో చూసి తెల్లబోయాడు కోదండరామిరెడ్డి. నిర్మాత బుచ్చిరెడ్డికి ఫోన్‌ చేసి ‘ఏమిటి నిర్మాతగారు ఇది.. నాతో చెప్పకుండా ఇలా ఎందుకు ప్రకటించారు ? అని అడిగాడు. ‘అక్కినేనిగారు నీ అభిమాన హీరో కదా. మరోసారి ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే చేయవా ఏమిటి ? అంటూ నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేశారు.

కట్ చేస్తే. ‘గోపాలకష్ణుడు’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ సినిమా పెద్ద ప్లాప్. అదే సమయంలో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరో సినిమా కూడా ప్లాప్ అయింది. దాంతో బుచ్చిరెడ్డి మనసు మార్చుకున్నారు. కోదండరామిరెడ్డి – అక్కినేని కాంబినేషన్ లో సినిమా మళ్ళీ డైరెక్టర్ కి చెప్పకుండానే కట్ చేసేశాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Arunachalam Moksha Margam

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...
Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper