OG 2 Story: సుమారుగా 12 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో క్లీన్ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాని ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానులే కాపాడుకున్నారు అనొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో కథ అనేది లేదు. టేకింగ్ కూడా చాలా యావరేజ్. థమన్ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, స్టైల్, స్వాగ్ ఈ చిత్రాన్ని కాపాడాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం, ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సన్నివేశమే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలు అయ్యాయి. కేవలం అభిమానులు చూస్తేనే ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే, ఇక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉండుంటే ఈ సినిమా ఏ రేంజ్ సునామీ ని సృష్టించి ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఓజీ ప్రీక్వెల్ ఆ రేంజ్ లోనే ఉండబోతుంది అని ఆ సినిమాకు సంబంధించిన కామిక్ బుక్ ని చదివితే అర్థం అవుతుంది. ఈ ప్రీక్వెల్ లో ఓజాస్ గంభీర మరియు అతని తండ్రి నేపధ్యాన్ని చూపించబోతున్నాడు డైరెక్టర్ సుజిత్. ఓజాస్ గంభీర తండ్రి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆర్మీ కి హెడ్. అతనికి, సుభాష్ చంద్ర బోస్ కి జపాన్ లో ఉన్నప్పుడు ఎదురైనా పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు అట సుజీత్. తన తండ్రి ఎలా చనిపోయాడు, అనాధ గా మారిన ఓజాస్ గంభీర, జపాన్ లోని సమురాయ్ సమూహానికి లీడర్ గా ఎలా ఎదిగాడు. మళ్లీ అక్కడి నుండి ఇండియా కి తిరిగి రావడానికి గల కారణాలు ఏమిటి?, కణ్మయి తో అతనికి పరిచయం ఎలా ఏర్పడింది?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గా ఓజీ ప్రీక్వెల్ ఉంటుందట. ఈ రేంజ్ స్టోరీ తో తెరకెక్కిస్తే మాత్రం, ఈసారి తెలుగు స్టేట్స్ మాత్రమే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అవుతుందని అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.