Sabbani Venkat: నాయకుడంటే వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ మైంటైన్ చేయాలా.. పదులకొద్ది కార్లలలో తిరుగుతూ ఉండాలా. అనుచరులతో హంగామా చేయాలా.. చుట్టపు చూపుగా వచ్చి.. వెళ్లిపోవాలా.. ఇప్పటివరకు ఆ గడ్డపై గెలిచిన వారంతా చేసిన పని అదే.. కానీ రాజకీయమంటే ఇది కాదని.. రాజకీయమంటే సేవ అని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. మాట సూటిగా.. అడుగు గట్టిగా.. చూపు వాడిగా.. మొత్తానికి అతడు నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం. సేవా తత్పరతకు ప్రతిబింబం. అలాగని అతడేమీ డబ్బున్న వాడు కాదు. బలమైన నేపథ్యమున్నవాడు అంతకంటే కాదు. తండ్రి పేరు చెప్పుకొని, తాతల పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నవాడు అంతకన్నా కాదు.
హుజరాబాద్ గడ్డలో ఎంతోమంది నాయకులు గెలుపొందారు. తమ రాజకీయ ప్రస్థానాన్ని గొప్పగా చాటుకున్నారు. కానీ ప్రజల సమస్యల పరిష్కారంలో మాత్రం ఆస్థాయి దూకుడు కొనసాగించలేకపోయారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగారు.. ఆస్తులను సంపాదించుకున్నారు. కానీ చరిత్రలో తొలిసారిగా ఓ యువకుడు నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా తనను తాను మలచుకుంటున్నాడు. కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్రంగి, చేనేత, ఈత, తెలగ, బలిజ, ఒంటరి, మాదిగ, మాల.. ఇలా ప్రతి కులానికి.. ప్రతి నేపథ్యానికి దగ్గరయ్యాడు. ప్రతి సమస్యను తెలుసుకొని.. దానికి పరిష్కారం మార్గం వెతుకుతున్నాడు.. అలాగని అతడి చేతిలో పదవి లేదు. ఉన్నది కేవలం ఒక ప్రైవేటు ఉద్యోగం మాత్రమే. ఎటువంటి ఆర్థిక నేపథ్యం లేకుండానే పుట్టిన గడ్డకు ఇంతటి సేవ చేస్తున్నాడంటే మాటలు కాదు.

ఇంతటి సేవ చేస్తున్న ఆ వ్యక్తి పేరు సబ్బని వెంకట్. హుజురాబాద్ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరసపల్లి సొంత గ్రామం. పేద కుటుంబంలో జన్మించిన అతడు అసాధారణంగా ఎదిగాడు. ఉన్నత చదువులు చదివి.. రాష్ట్రాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. మారుమూల గ్రామంలో పుట్టిన అతడు నేడు జెన్ ఫ్యాక్ట్ అనే ఐటీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ దాకా ఎదిగాడు. తాను ఎదగడం మాత్రమే కాదు ఎంతో మందికి వెలుగునిచ్చాడు. ఎదుగుదల లో సహాయపడ్డాడు. తాను ఆర్థికంగా స్థిరత్వం సంపాదించకపోయినప్పటికీ పుట్టిన గడ్డకు ఎంతో కొంత సేవ చేయాలని పరితపించే వ్యక్తిత్వంతో ముందుకు వచ్చాడు. బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంపులో నిర్వహణతో ప్రజల మెప్పు పొందాడు. కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించడం మొదలుపెట్టాడు. ఎంతోమంది యువతకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు.. వారికి ఉద్యోగాలు వచ్చేలా కూడా చేశాడు.

వెంకట్ తండ్రి వృత్తిరీత్యా సింగరేణి కార్మికుడు. ఆయన బెల్లంపల్లిలో నివాసం ఉండేవారు. సింగరేణి కార్మికుడు అయినప్పటికీ వెంకట్ దిగువ మధ్యతరగతి జీవితాన్ని అనుభవించారు. కష్టపడి చదువుకొని.. బెల్లంపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఆ తర్వాత తన తండ్రికి భూపాలపల్లికి బదిలీ అయింది. దీంతో వెంకట్ మకాం భూపాలపల్లి జిల్లాకు మరచి వచ్చింది. అక్కడ కూడా ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. 2007లో తన జీవితం మీద తానే ప్రయోగాలు చేసుకున్నారు. ఇందులో భాగంగానే అదే ఏడాది ఐబీఎం అనే ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. దినదిన ప్రవర్తమానంగా ఎదిగి.. ఏకంగా జెన్ ఫ్యాక్ట్ లాంటి ఐటీ కంపెనీకి ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.
చిన్నప్పటినుంచి వెంకట్ కు సేవ చేయడం అంటే చాలా ఇష్టం. పైగా సామాజిక చైతన్య ఉన్న ప్రాంతంలో పుట్టడంతో సహజంగానే ఆయనలో ప్రశ్నించే స్వభావం అధికంగా ఉండేది. అందువల్లే ఆయన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. తన పుట్టినరోజు నాడు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పటివరకు వెంకట్ 5000 మందికి నేత్ర వైద్య శాస్త్ర చికిత్సలు చేయించారు.. ఇందులో 147 మందికి అత్యంత క్లిష్టమైన, ఖరీదైన ఆపరేషన్లు చేయించారు. రక్తదానం ద్వారా వేలాది మంది ప్రాణాలు కాపాడారు. వెంకట్ ఆధ్వర్యంలో 90 వాట్సప్ గ్రూపులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ప్రతిరోజు దాదాపు వందలలో వీరికి రిక్వెస్ట్లు వస్తుంటాయి. వాటన్నింటినీ కూడా పరిశీలించి సేవలు అందించడం ఈ బృందాల ప్రధాన లక్ష్యం. కేవలం సేవా కార్యక్రమాలతోనే ఆగిపోలేదు వెంకట్. యువతకు చదువు తర్వాత అత్యంత ముఖ్యమైనది ఉద్యోగం. ఆ ఉద్యోగాలను కల్పించడంలో నిత్యం వెంకట్ కృషి చేస్తూనే ఉన్నారు. ఐటీ పరిశ్రమ తిరోగమనంలో ఉన్న నేటి కాలంలో.. చాలామంది యువతకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలకు ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఎలా చేస్తున్నారు. ఇటీవల హుజరాబాద్ నగరంలో మార్కెట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ కనిపించకుండా పోయింది. కానీ వెంకట్ మాత్రం నేను ఉన్నానంటూ ముందుకు వచ్చారు. అంతేకాదు అక్కడి ప్రజలను ఆదుకున్నారు.

నిత్యం యువతతో వెంకట్ టచ్ లో ఉంటారు. కేవలం హుజరాబాద్ నియోజకవర్గం మాత్రమే పరిమితం కాకుండా కమలాపూర్, జమ్మికుంట ప్రాంతాలలో కూడా నిత్యం తిరుగుతుంటారు. ప్రాంతాల మీదుగా జాతీయ రహదారులు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి స్థాయిలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో ఒక వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేస్తానని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. వీటిని మాటలకే పరిమితం చేయకుండా అధికార పార్టీని.. కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలను కలుస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నిత్యం వారి వద్ద విన్నవిస్తూనే ఉన్నారు. తనకు కావాల్సింది సేవ మాత్రమేనని.. రాజకీయాలు అనేవి తర్వాత అని వెంకట్ స్పష్టం చేస్తున్నారు. నేటి కాలంలో ప్రజల నుంచి ఎంత వసూలు చేశాం అనే నాయకులు ఉన్నారు. కానీ వెంకట్ మాత్రం అలా కాదు. తన దగ్గర లేకున్నా సరే ప్రజలకు పెడుతున్నారు. ప్రజల బాగోగులను చూసుకుంటున్నారు. అధికారం లేకుండా ఇన్ని చేస్తే.. అధికారం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో చేయాలి.. అందుకే ఈసారి హుజరాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొత్త రక్తం వచ్చింది. కొత్త నాయకుడు వచ్చాడు. అన్నింటికీ మించి సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న నాయకుడు గట్టిగా నిలబడ్డాడు.