Fauji: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్(Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా వాళ్లందరిని తన అభిమానులుగా మార్చుకునే విధంగా చేస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. సీతారామం (Seetharamam)సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ సినిమాతో మరోసారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా యావత్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకొని ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే సీతారామం సినిమాతో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. హను స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటుంది. ఆయన రాసే సినిమాలో ఎమోషన్ ఉంటూనే ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది. అందువల్లే హను రాఘవపూడి సినిమాలను చూడడానికి యావత్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read: సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…
ఆయన చేసిన సినిమాలు హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలో ఊహించని విలన్ ను తీసుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో మొదటి నుంచి కూడా విలన్ ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంచి క్లైమాక్స్ లో రివిల్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన చేసిన సీతారామం సినిమాలో కూడా అలాంటి ఒక స్ట్రాటజీని వాడి సక్సెస్ ని సాధించారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి స్క్రీన్ ప్లే నే వాడుతూ ముందుకు సాగుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్న దర్శకుడు తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు… ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు… ఇక ఈ రెండు సినిమాలతో ప్రభాస్ ఎలాగైనా సరే మరోసారి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నాడు…
Also Read: రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు…