https://oktelugu.com/

Bollywood: ఫుల్ స్పీడ్ లో విక్రమ్ – వేద హిందీ రీమేక్ షూటింగ్…

Bollywood: తమిళంలో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీసీరీస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్, ఎస్‌.శ‌శికాంత్ వైనాట్ స్టూడియోస్‌ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అబుదాబిలో 27 రోజుల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 06:22 PM IST
    Follow us on

    Bollywood: తమిళంలో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీసీరీస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్, ఎస్‌.శ‌శికాంత్ వైనాట్ స్టూడియోస్‌ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అబుదాబిలో 27 రోజుల ఫ‌స్ట్ షెడ్యూల్‌ని చిత్రయూనిట్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో హృతిక్ రోష‌న్ పాల్గొన్నారు. ల‌క్నోలో జ‌రిగే సెకండ్ షెడ్యూల్‌లో సైఫ్ అలీఖాన్ పాల్గొననున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాధికా ఆప్టే న‌టిస్తున్నారు. విక్ర‌మ్‌వేద ఒరిజిన‌ల్‌ సినిమా క‌థ రాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్క‌ర్‌, గాయ‌త్రి హిందీ లోనూ దర్శకత్వం వహిస్తున్నారు.

    interesting update about hrithik and saif vikram vedha remake movie shooting

    Also Read: మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్…

    ఈ సందర్భంగా పుష్క‌ర్‌, గాయ‌త్రి మాట్లాడుతూ..“గొప్ప స్టార్లు హృతిక్‌, సైఫ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అద్భుత‌మైన టీమ్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాం. అత్యంత ఇంటెన్స్ , ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్ ను డెలివ‌రీ చేస్తామ‌నే న‌మ్మ‌కం ఉంది“ అని అన్నారు. విక్ర‌మ్ ఔర్ బీటాల్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన నియో – నాయ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఒక పోలీస్‌.. ఒక గ్యాంగ్‌స్ట‌ర్‌… ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ని ప‌ట్టుకోవ‌డానికి పోలీస్ చేసిన ఆస‌క్తిక‌ర ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా. హృతిక్‌, సైఫ్ లాంటి స్టార్స్ కలిసి నటించంనుండటంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. కాగా 2022 సెప్టెంబ‌ర్ 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయనున్నారు.

    Also Read: బాలీవుడ్ లో ట్యాలెంట్ కన్నా ఇంటి పేరు ముఖ్యం అంటున్న… వివేక్ ఒబెరాయ్