Atlee And Allu Arjun: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్… ‘పుష్ప 2’ సినిమాతో బాహుబలి రికార్డును బ్రేక్ చేసి మరి సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఆయన సాధించిన విజయం ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది మరొక ఎత్తుగా మారబోతోంది…ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా సూపర్ హీరో నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని విజువల్ వండర్ గా మలచడానికి అట్లీ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇక భారీ గ్రాఫికల్ విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ తార స్థాయికి వెళ్ళిపోతోంది…
లేకపోతే మాత్రం ఆయన తన మార్కెట్ ను భారీగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తుండటం విశేషం…ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తోందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పాన్ వరల్డ్ సినిమాలను చేస్తున్న మన తెలుగు హీరోలందరు టాప్ పొజిషన్ ను అందుకోవాలని చూస్తున్నారు. ఇక వాళ్ళు అందరికంటే ఒక అడుగు ముందు వరుసలో ఉన్న అల్లు అర్జున్ కూడా పాన్ వరల్డ్ సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ ఏంటో ప్రపంచ స్థాయిలో తెలియజేస్తానని అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఇక దాని గురించే ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు. దర్శకుడు అట్లీ సైతం అదే రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది…ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ టాప్ పొజిషన్ లో ఉండటం విశేషం…