Pawan Kalyan Vs Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ఎవరు స్టైల్ లో వాళ్ళు సినిమాలను చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా హీరోలు పాన్ ఇండియా స్థాయి లో రికార్డు లను బ్రేక్ చేసే స్థాయికి ఎదిగారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ల నుంచి సినిమాలు వచ్చాయంటే ఆ సినిమాలు ప్లాప్ అయిన అవుతాయి. లేకపోతే భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ఇండస్ట్రీ హిట్ గా అయిన మిగులుతాయి. అంతే తప్ప ఆవరేజ్ సినిమాలు గా మాత్రం మిగలవు…ఈ ఇద్దరి సినిమాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ గౌరవమైతే దక్కుతోంది. వాళ్లు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇక రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. 400 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది…
ఇప్పుడు బాలయ్య బాబు హీరోగా వస్తున్న ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సాధిస్తుందని పలువురు సినిమా మేధావులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇండస్ట్రీలో బాలయ్యకి గొప్ప గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటికే అఖండ మొదటి పార్ట్ పెను ప్రభంజనాన్ని సృష్టించింది.ఇక సెకండ్ పార్ట్ మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. దాంతోపాటుగా దేవుని మీద బేస్ చేసుకొని వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద హైపైతే విపరీతంగా ఉంది.
అలాగే అఖండ వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ అఖండ 2 సినిమా సైతం భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే దిశగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తో 400 కోట్లు కొల్లగొట్టాడు. ఇక బాలయ్య అఖండ 2 సినిమాతో ఈ రికార్డు ను బ్రేక్ చేస్తాడా..? పవన్ కళ్యాణ్ బాలయ్య ల మధ్య జరుగుతున్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది…ఇక వీళ్ళిద్దరిలో ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన హీరో ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…