Krishnam Raju Interesting Facts: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. 1966లో ‘చిలకాగోరింక’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఆయన ఆరంగేట్రం చేశారు. 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు 56 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉంది. తెలుగులో మొట్టమొదటి నంది అవార్డును అందుకున్న రికార్డు కూడా ఆయనదే.

అలాగే, కృష్ణంరాజు రెబల్ స్టార్ గా సినిమాల్లో ఎదిగిన తీరు బహుశా ఎవరికీ సాధ్యం కాదు. ఆయన శ్రీమంతుల కుటుంబం నుంచీ వచ్చారు. ఏ నటుడికైనా అవకాశం వస్తే చాలనుకుంటారు కానీ కృష్ణంరాజు మాత్రం ఎన్నో అవకాశాలు వదిలేసారు. నటనపై పూర్తి పట్టు సాధించాకే వెండితెరపై మెరిశారు. ఆయన అంతకుముందు ఓ జర్నలిస్టుగా, ఫోటోగ్రాఫర్ గా పనిచేశారని విషయం చాలామందికి తెలియదు.
కృష్ణంరాజు సూపర్ హిట్ సినిమాలు చాలా విభిన్నమైనవి. ఆ సినిమాలు మరో హీరో చేసి ప్లాప్ అయ్యేవి. ఒక్క కృష్ణంరాజు కాబట్టే.. అవి హిట్ అయ్యాయి.ఆ సినిమాల్లో ముఖ్యంగా బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, ధర్మాత్ముడు, కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులు లాంటివి మంచి సినిమాలు ఉన్నాయి.

అయితే, కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులు 10రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. కటకటాల రుద్రయ్య అప్పట్లోనే రూ.75 లక్షల గ్రాస్ వసూల్ చేసి ఇండస్ట్రీలో రికార్డు నెలకొల్పింది. అది రెబల్ స్టార్ అంటే. పైగా ఎందరికో మార్గదర్శిగా కృష్ణంరాజు గారు మారారు.
కారణం రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమనటుడిగా స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు. నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ చేరి ప్రజాసేవలోనూ నిరూపించుకున్నారు. అప్పటి వాజ్‌పేయ్ మంత్రి వర్గంలో పనిచేశారు. కృష్ణంరాజు ఎందరికో మార్గదర్శిగా నిలిచారు.