Krishnam Raju- Chiranjeevi and Mahesh Babu: రెబల్ స్టార్ మృతి పై మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు. తెలుగు చిత్రసీమలో శ్రీ కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోయారు చిరు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎమోషనల్ అవుతూ ఒక మెసేజ్ ను స్వయంగా రాసి పోస్ట్ చేశారు. ‘శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి తో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రి గా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరని లోటు. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపం తెలియచేసుకుంటున్నాను” అంటూ మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు.

ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ రోజు తెల్లవారు జామున అస్తమించారు అని తెలియగానే సీఎం కేసీఆర్ కూడా చలించిపోయారు. వెంటనే కృష్ణంరాజు గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ఆయన అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. దీనితో అంత్యక్రియల ఏర్పాట్లను చేపట్టారు సీఎస్ సోమేశ్‌కుమార్. అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.
ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎమోషనల్ అవుతూ ఒక మెసేజ్ ను స్వయంగా రాసి పోస్ట్ చేశారు. ‘కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజిది. కృష్ణంరాజు గారి జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని మహేష్ ట్వీట్ చేశారు.

‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ కూడా మెసేజ్ చేసిన సంగతి తెలిసిందే.
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022