https://oktelugu.com/

Bandla Ganesh- Vijay Deverakonda: ఎన్టీఆర్, మహేష్, చరణ్ పేర్లతో ‘విజయ్ దేవరకొండ’కు బండ్ల గణేష్ కౌంటర్

Bandla Ganesh- Vijay Deverakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమి మాట్లాడాడు అంటే.. ‘ఈ మాస్ మెంటల్ ఏందిరా అయ్యా.. మా […]

Written By:
  • Shiva
  • , Updated On : July 23, 2022 / 12:38 PM IST
    Follow us on

    Bandla Ganesh- Vijay Deverakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

    Bandla Ganesh- Vijay Deverakonda

    ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమి మాట్లాడాడు అంటే.. ‘ఈ మాస్ మెంటల్ ఏందిరా అయ్యా.. మా అయ్యా తెల్వదు, మా తాతా తెల్వదు.. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతోంది. అది కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. ట్రైలర్‌ కే ఈ రచ్చ ఏందిరా నాయానా.. మీ ప్రేమను నేను మాటల్లో చెప్పలేనంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

    Also Read: SS Thaman Remuneration: జాతీయ అవార్డుతో థమన్ రెమ్యూనరేషన్ భారీగా పెంపు.. ఎంతో తెలుసా..?

    మొత్తానికి తన మేనరిజంతో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడు విజయ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ పరోక్షంగా నెపోటిజం స్టార్స్ పై సెటైర్ వేసినట్లు అయింది. తాతలు తండ్రుల పేరు చెప్పుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కామెంట్స్ చేశాడని విమర్శలు వినిపిస్తున్నాయి.

    అందుకే, తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ విషయం పై పరోక్షంగా ఒక ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది. ”తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా.. గుర్తుపెట్టుకో బ్రదర్..” అని బండ్ల గణేష్ పోస్ట్ చేశాడు.

    Bandla Ganesh- Vijay Deverakonda

    పైగా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కూడా ట్యాగ్ చేశాడు. మొత్తానికి బండ్ల గణేష్.. విజయ్ దేవరకొండ పై ఇలా విరుచుకుపడ్డాడు. మరి విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ ఈ అంశం పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అన్నట్టు లైగర్ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.

    విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. పూరి కూడా ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

    Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ 11 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

    Tags