https://oktelugu.com/

Lavanya-Varun Tej marriage : లావణ్య-వరుణ్ తేజ్ వివాహం పై ఇంట్రెస్టింగ్ న్యూస్…

సడన్ గా నిశ్చితార్థం అంటూ బాంబు పేల్చారు. జూన్ 9న నాగబాబు నివాసంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులు, హీరోలు హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2023 / 08:12 PM IST

    Varun Tej - Lavanya Tripathi Engagement:

    Follow us on

    Lavanya-Varun Tej marriage : టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఈ నెలాఖరులో పెళ్లి ఉంటుందని గట్టిగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. వెడ్డింగ్ ప్లానర్స్ పనులు మొదలుపెట్టారట. లావణ్య, వరుణ్ ల వెడ్డింగ్ ఇటలీలో జరగనుందని మొదటి నుండి వినిపిస్తోంది. షూటింగ్ లో భాగంగా ఇటలీలో కలిసిన వరుణ్, లావణ్య ల మధ్య అక్కడే ప్రేమ చిగురించిందట. అందుకే ఇటలీని ఎంచుకున్నారట. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి ఒక 50 మంది హాజరుకానున్నారట. పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం లేదట.

    వివాహమైన వారం రోజుల తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారట. మరొక ఆసక్తికర వార్త ఏమిటంటే వరుణ్-లావణ్యల వివాహం రాచరిక పద్ధతిలో నిర్వహించనున్నారట. అందుకు కూడా ఓ కారణం ఉందట. లావణ్య త్రిపాఠి రాయల్ ఫ్యామిలీ నేపథ్యం కలిగిన అమ్మాయి అట. అందుకే రాచరిక పద్ధతిలో వివాహం చేస్తారట. ఇందుకు భారీగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

    అయితే ఇవన్నీ పరిశ్రమలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు మాత్రమే. అధికారిక సమాచారం అందాల్సి ఉంది. మిస్టర్ మూవీ కోసం మొదటిసారి కలిసిన లావణ్య, వరుణ్ క్రమేణా ప్రేమికులు అయ్యారు. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా వీరి రిలేషన్ వెలుగులోకి వచ్చింది. కాగా ఈ వార్తలను లావణ్య త్రిపాఠి ఖండించారు. వరుణ్ నాకు మిత్రుడు మాత్రమే. ప్రేమించుకుంటున్నామనే వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.

    సడన్ గా నిశ్చితార్థం అంటూ బాంబు పేల్చారు. జూన్ 9న నాగబాబు నివాసంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులు, హీరోలు హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన లావణ్య త్రిపాఠి కెరీర్ బుల్లితెర మీద మొదలైంది. అందాల రాక్షసి మూవీతో హీరోయిన్ అయ్యారు. ఈ మూవీ ఆమెకు విపరీతమైన ఫేమ్ తెచ్చింది. టాలీవుడ్ లో లావణ్య ఓ స్థాయి హీరోయిన్ గా ఎదిగారు.