Venkatesh And Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. నెంబర్ వన్ పొజిషన్ ను అందుకోవడానికి ప్రతి ఒక్క హీరో తనదైన రీతిలో కష్టపడుతూ ఉంటాడు. అందుకే సక్సెస్ వచ్చిన ప్రతిసారి దాన్ని కాపాడుకోవడానికి తర్వాత చేసే సినిమాల సెలెక్షన్స్ లో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పటివరకు సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకులకు మాత్రమే తమతో సినిమా చేసే అవకాశాన్ని ఇస్తారు. దాని ద్వారా హీరోలు తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకానొక సమయంలో వెంకటేష్ ఎలాంటి సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నాడో అతన్ని ఫాలో అవుతూ నాగార్జున సైతం అలాంటి సినిమాలనే చేశాడు. వాటితో సక్సెస్ లను కూడా సాధించాడు. నిజానికి నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా రకాల ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినప్పటికి ఒకానొక సమయంలో మాత్రం వెంకటేష్ ని ఫాలో అవుతూ ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేశాడు… వెంకటేష్ హీరోగా, సౌందర్య హీరోయిన్ గా వచ్చిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా 1996 లో వచ్చి సూపర్ సక్సెస్ ను సాధించింది.
ఈ సినిమాలో కామెడీ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలకు కూడా చాలా పెద్ద పీట వేశారు. ఇవివి సత్య నారాయణ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్ సాధించింది… ఇక ఇవివి దర్శకత్వంలోనే నాగార్జున సైతం ‘ఆవిడ మా ఆవిడే’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా 1998 లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో కామెడీ ఉండడంతో పాటు సెంటిమెంటల్ సీన్స్ ఉండటంతో మూవీ ప్రేక్షకులను మెప్పించింది.
యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరు ఈ సినిమాను ఆదరించారు. మొత్తానికైతే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను సాధించడం విశేషం… వెంకటేష్ 1999 వ సంవత్సరంలో ముప్పలనేని శివ దర్శకత్వంలో ‘రాజా’ అనే సినిమా చేసి ప్రేక్షకులందరికి దగ్గరయ్యాడు. ఒకరకంగా తన సెంటిమెంట్ సన్నివేశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం తన వైపు తిప్పుకున్నాడు…
ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత నాగార్జున సైతం 2000 సంవత్సరంలో ‘నువ్వొస్తావని’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సైతం నాగార్జునకు మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టింది. మొత్తానికైతే వెంకటేష్ ని ఫాలో అవుతున్న నాగార్జున మంచి సక్సెస్ ను సాధించడం అతని అభిమానులను ఆనందపరిచింది…