Akhanda 2 Movie Trailer: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో శేషమైన స్పందన ఉంటుంది. ఎందుకంటే బాలయ్య మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తన సినిమాలు ఆవరేజ్ గా ఉన్నా కూడా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ఉంటాయి. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటే నాగార్జున, వెంకటేష్ లు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేస్తూ మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించారు…అందుకే నాగార్జున వెంకటేష్ లతో పోలిస్తే చిరంజీవి బాలకృష్ణ లకు ఉన్న ఇమేజ్ ఎక్కువనే చెప్పాలి. బాలయ్య వరుస సక్సెస్ లతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే నాలుగు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న ఆయన ఇప్పుడు బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ను సాధించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సనాతన ధర్మాన్ని చెప్పే ఉద్దేశ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు… బోయపాటి మార్క్ అక్కడక్కడ కనిపించినప్పటికి ఓవరాల్ గా బాలయ్యని హైలెట్ చేశారు. అయినాప్పటికి ఆ షార్ట్ మేకింగ్ లో గాని, ఫైటింగ్ సన్నివేశాల్లో బాలయ్య బాబు చాలావరకు తేలిపోయినట్టుగా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో కూడా ఇలానే ఉంటే మాత్రం సినిమా సక్సెస్ ని సాధించడం చాలా కష్టమవుతోంది. ఇప్పటికి వరుసగా మూడు సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్నా వీళ్ళ కాంబినేషన్ నాలుగో విజయంతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంటారు అనుకుంటే ఈ సినిమా ట్రైలర్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు.
దాంతో బాలయ్య అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు…ఇక డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోంది. తద్వారా బాలయ్య బాబు వరుసగా తన ఖాతాలో మరిసక్సేస్ ను వేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…