Mahesh Babu And Krishna Vamsi: ‘రాజకుమారుడు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు మహేష్ బాబు… దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. ఇక తర్వాత చేసిన రెండు, మూడు సినిమాలు అతనికి ప్రత్యేక గుర్తింపును తీసుకురాకపోవడంతో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మురారి’ సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కృష్ణవంశీ మహేష్ బాబు కాంబినేషన్లో మరొక సినిమా రావాల్సింది…కృష్ణవంశీ స్టోరీ రెడీ చేసుకొని మహేష్ బాబు కి వినిపించాడు. మహేష్ బాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కృష్ణ కూడా ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా తొందర్లోనే స్టార్ట్ అవుతోంది అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో ఇటు కృష్ణవంశీ తన సినిమాల్లో బిజీగా ఉండడం, అటు మహేష్ బాబు సైతం ఒక్కడు మూవీ తో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఒక్కడు తర్వాత కూడా కృష్ణవంశీ మరోసారి అడిగినప్పటికి మహేష్ గుణశేఖర్ తో అర్జున్ మూవీ చేస్తున్న తర్వాత చూద్దాం అని చెప్పాడట. దాంతో వీళ్ళ కాంబినేషన్ కి బ్రేక్ పడింది. కృష్ణవంశీ – మహేష్ బాబు కాంబినేషన్ లో మరొక రిసినిమా వస్తే బాగుండేది అంటూ చాలావరకు కామెంట్లను వ్యక్తం చేసినప్పటికి అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
మహేష్ బాబు ‘అర్జున్’ లాంటి ప్లాప్ సినిమా కోసం కృష్ణవంశీ ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ కెరియర్ మొదట్లో తనకి యాక్టింగ్ పెద్దగా రాదు అంటూ కొన్ని విమర్శలను ఎదుర్కొన్నాడు. అప్పుడు కృష్ణవంశీ డైరెక్షన్లో చేయడంతో మహేష్ బాబు యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది.
అందుకే మరోసారి అతని కాంబినేషన్లు సినిమా చేస్తే తనలోని పూర్తి నటుడు బయటికి వస్తాడని అభిమానులు సైతం భావించారు. కానీ అప్పుడు వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ఇద్దరు లైట్ తీసుకున్నారు… ఇక మొత్తానికైతే కృష్ణవంశీ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయాడని అడపదడప సినిమాలు చేసిన కూడా అవి ప్రేక్షకులను పెద్దగా మెప్పించడం లేదు.
మరి ఇలాంటి సందర్భంలో కృష్ణవంశీ చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక అతని నుంచి ఇంకా కొత్త సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ఏది రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి అతను స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…