Vishwambhara Villain: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘విశ్వంభర'(Viswambhara Movie) చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే క్లారిటీ నిన్న మొన్నటి వరకు అభిమానుల్లో ఉండేది. కానీ నేడు ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వబోతుందని అభిమానులకు ఒక క్లారిటీ ఇవ్వడం తో సందేహాలకు తెరపడింది. చాలా మంది ఈ చిత్రం సెప్టెంబర్ 25 న వస్తుందని,ఓజీ చిత్రంతో పోటీ పడాల్సి వస్తుందని, బ్రదర్స్ మధ్య పోటీ అంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని ఈరోజు తేలిపోయింది. డైరెక్టర్ వశిష్ఠ కూడా ఒక ఇంటర్వ్యూ లో ఇదే చెప్తాడు. VFX వర్క్ నూటికి నూరు శాతం నన్ను సంతృప్తి పరిస్తేనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తాము, అప్పటి వరకు ప్రకటించము అని చెప్పుకొచ్చాడు. 80 శాతం VFX పూర్తి అయ్యింది, కేవలం 20 శాతం మాత్రమే బ్యాలన్స్ ఉంది.
Also Read: విశ్వంభర గ్లింప్స్ లో ఏముంది..? దీని కోసం ఇంతలా వెయిట్ చేయాలా..?
ఆ 20 శాతం కోసమే డైరెక్టర్ పట్టుబడుతున్నారు. ఇకపోతే రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు ‘విశ్వంభర’ కి సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి టీజర్ ని చూసి అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు. గొప్ప చిత్రం తీస్తారని అనుకుంటే, ఇంత దారుణమైన VFX పెడతారని అనుకోలేదంటూ అభిమానులు మూవీ టీం ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి ఏకిపారేశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి రాలేదు. గ్లింప్స్ వీడియో చాలా చక్కగా ఉంది, ఒక సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపించింది. ఒక మంచి అడ్వెంచర్ సినిమాని చూడబోతున్నాము అనే ఫీలింగ్ ని రప్పించింది ఈ చిత్రం. అంతా బాగానే ఉంది కానీ, రెండు టీజర్స్ ని విడుదల చేశారు, ఈ రెండు టీజర్స్ లోనూ విలన్ ఎవరో రివీల్ చేయలేదు డైరెక్టర్.
ఈ సినిమా ప్రారంభమైన కొత్తలో ఇందులో రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. మొదటి టీజర్ లో కేవలం రాజీవ్ కనకాల మాత్రమే కనిపించాడు, కానీ ఆయనది చూస్తే పాజిటివ్ క్యారక్టర్ అని తెలుస్తుంది. మరి విలన్ క్యారక్టర్ ఎవరు?, మెగాస్టార్ తో ధీటుగా వీరోచితంగా పోరాడాలంటే ఒక పేరున్న నటుడినే విలన్ గా తీసుకోవాలి. మరి ఈ చిత్రం లో అదే చేశారా?, లేకపోతే కొత్త వాళ్ళని తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఒక బాలీవుడ్ సీనియర్ హీరోని ఇందులో విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అది సర్ప్రైజ్ గా ఉంచాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పటి వరకు విలన్ ఎవరు అనేది చూపించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇకపోతే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా త్రిష, సెకండ్ హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.