Vishwambhara Movie Glimpses Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని గొప్ప స్థానాన్ని తీసుకొచ్చి పెట్టడమే కాకుండా గత 50 సంవత్సరాలు నుంచి మెగాస్టార్ గా తన స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ వస్తున్నాడు… ఇక ప్రజారాజ్యం పార్టీని పెట్టి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన ఆయన సినిమాలకి దాదాపు పది సంవత్సరాలపాటు బ్రేక్ ఇచ్చాడు. 2017 వ సంవత్సరంలో ఖైదీ నెంబర్ 150 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ను భారీగా స్టార్ట్ చేసిన చిరంజీవి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అప్పటినుంచి వరుసగా విజయాలను అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అడపదడప సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు తప్ప ఇప్పుడున్న జనరేషన్ లో స్టార్ హీరోలకు పోటీ ని ఇవ్వలేకపొతున్నాడు. వాళ్ళందరూ భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే వాళ్ళతో పాటు భారీ సక్సెస్ లను సాధించడంలో చిరంజీవి వెనుకబడిపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన చేయాల్సిన సినిమాలు ఎఫెక్టివ్ గా ఉండడం లేదని చాలామంది విమర్శలను చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా విశ్వంభర సినిమా నుంచి గత కొద్దిసేపటి క్రితమే గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ గ్లింప్స్ లో చిరంజీవి కత్తి పట్టుకొని నరుకుతూ కనిపించినప్పటికి చిరంజీవి రెగ్యూలర్ గా అన్ని సినిమాల్లో ఫైట్ చేసినట్టుగానే ఈ సినిమాలో కూడా ఫైట్ చేస్తూ కనిపించాడు. ఇక అంతకుమించి పెద్దగా కొత్తదనం అయితే ఏమీ కనిపించలేదు. ఒక అమ్మాయికి ఒక తాత కథను చెబుతూ రాక్షసుల గురించి ఎస్టాబ్లిష్ చేస్తూనే వారందరిని సేవ్ చేయడానికి వచ్చిన ఒక సేవియర్ గా చిరంజీవి పాత్రను ఎలివేట్ చేస్తూ చూపించాడు…ఇదే కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా సినిమాలైతే వచ్చాయి.
Also Read: పూర్తిగా తమిళ సినిమాలాగా మార్చేసిన అట్లీ..అల్లు అర్జున్ పొరపాటు చేశాడా?
మరి కొత్తగా ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా ఈ సినిమా స్టార్ట్ చేసి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు సినిమాను రిలీజ్ చేయలేదు. కారణమేంటి అంటే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల అది తొందరగా అవ్వడం లేదని అందుకే కాంప్రమైజ్ అవ్వకుండా గొప్ప సినిమాను తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.
ఈ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ ప్రాధాన్యమైన షాట్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించలేదు. కొన్ని చోట్ల అది గ్రాఫిక్స్ అని ఈజీగా తెలిసిపోతోంది…గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి దానిని ఏర్పడకుండా నైట్ ఎఫెక్ట్ యాడ్ చేశారు. అలా చేసినంత మాత్రాన సీజీ షాట్స్ వర్కౌట్ అవుతాయి అనుకోవడం కరెక్ట్ కాదు..దీని కోసమేనా చిరంజీవి ఇన్ని రోజుల పాటు అతని అభిమానులను వెయిట్ చేయిస్తున్నాడు. గ్లింప్స్ పరిస్థితి ఇలా ఉంటే సినిమా 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షక ముందుకు వస్తోంది అంటూ చిరంజీవి స్పష్టంగా తెలియజేశాడు.
ఇక సినిమా కూడా ఇలానే కార్టూన్స్ మాదిరిగా ఉంటే ఈ సినిమా కూడా అంచనాలనైతే అందుకోలేదు… గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. దానిని ఎఫెక్టివ్ గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలైతే వచ్చాయి… ఇప్పుడు గ్లింప్స్ లో కనిపించిన గ్రాఫిక్స్ వర్క్ పెద్దగా ఇంప్రెస్సివ్ గా అయితే లేవు…