Sairat: సైరత్ లో ఏముంది? ఈ చిన్న సినిమా ప్రభుత్వాన్నే ఎందుకు కదిలించింది?

సినిమాలను చూస్తే ఫ్యామిలీలు చలించి పోయి ప్రభుత్వాలు మారిపోతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా.. అవును ఓ మరాఠీ సినిమా అలాంటి అద్భుతాన్నే సృష్టించింది.

Written By: Suresh, Updated On : December 15, 2023 1:51 pm

Sairat

Follow us on

Sairat: కటౌట్ చూసి మాట్లాడు డ్యూడ్ అంటుంటారు కొందరు. అది నిజమే కదా.. ఇక సినిమాల విషయంలో కూడా కంటెంట్ చూసి మాట్లాడాల్సిందే. చిన్న సినిమానా, పెద్ద సినిమానా? అనే ప్రశ్న కాకుండా కంటెంట్ ఎలా ఉంది అని మాట్లాడుకోవాల్సిందే. రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చిన, కాంతార, బలగం సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లో వెళ్లి సినిమాను చూడడం మాత్రమే కాదు. ఫ్యామిలీలు కూడా కలిసిపోయాయి. ఇలాంటి మరో సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాలను చూస్తే ఫ్యామిలీలు చలించి పోయి ప్రభుత్వాలు మారిపోతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా.. అవును ఓ మరాఠీ సినిమా అలాంటి అద్భుతాన్నే సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమాను చూసి ప్రభుత్వమే కదిలివచ్చింది. అదే మూవీ సైరత్. ఈ సినిమా వల్ల గవర్నమెంట్ ఓ చట్టాన్నే తీసుకొనివచ్చింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో వచ్చిన సైరత్ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఆశ్యర్యపోవడమే కాదు మరాఠీ ఇండస్ట్రీ వైపు అందరి దృష్టి మళ్ళింది. కులాంతర వివాహాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎందరినో కదిలిచింది.

ఆకాష్ థోసర్, రింకూ రాజ్ గురు జంటగా నటించిన ఈ సినిమాకు నాగరాజు మంజులే దర్శకత్వం వహించారు. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. ఇందులో హీరో తక్కువ కులానికి చెందిన వాడు. చదువులో రాణిస్తూనే క్రికెట్ లో ఆరితేరుతాడు. ఇందులో హీరోయిన్ భూస్వామి, రాజకీయ వేత్త కూతురు. ఈ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటారు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఆ తర్వాత ప్రేమ మొదలవుతుంది. ఇది తెలుసుకున్న హీరోయిన్ కుటుంబ సభ్యులు హీరోను కొడుతారు.

కుటుంబ సభ్యులు ప్రేమను అంగీకరించరని తెలుసుకున్న ఈ జంట సిటీకి వెళ్తారు. ఆ తర్వాత ఎలా సెటిల్ అయ్యారు? ఏంజరిగింది? కుటుంబ సభ్యులు కలుస్తారా లేదా అనే వివరాలకోసం సినిమా చూడాల్సిందే. కానీ చిన్న సినిమాగా వచ్చిన ఈ మరాఠీ సినిమా ఎందరినో ఆలోచింపజేయడమే కాదు. సూపర్ హిట్ ను సాధించి జనాల గుండెల్లో నిలిచింది. అంతే కాదు ఈ సినిమా ప్రేరణతో కులాంతర వివాహాలకు సపోర్ట్ గా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావడానికి సిద్దమైంది. అంతే కాదు ఇలా పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక సమస్యలు రాకుండా జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం.