Dunki: షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో వస్తున్న డంకీ సినిమా ఈనెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఈ సినిమా సక్సెస్ గురించి షారుఖ్ ఖాన్ అలాగే డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుంది అని హీరో డైరెక్టర్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇప్పటికే ఈ సంవత్సరం పఠాన్, జవాన్ లాంటి భారీ సక్సెస్ లను అందుకున్న షారుక్ ఖాన్ ఇప్పుడు ఈ సినిమాతో మరొక సక్సెస్ అందుకోవడానికి రెడీ అయ్యాడు. పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు. ఇక ఒకే సంవత్సరం ఒకే హీరో నుంచి రెండు 1000 కోట్ల సినిమాలు రావడం విశేషం.అలాగే ఇప్పుడు వస్తున్న డంకి సినిమాతో 1000 కోట్ల కలక్షన్స్ సాధిస్తే వరుసగా మూడు సినిమాలతో వెయ్యి కోట్ల కలక్షన్స్ ని సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా షారుక్ ఖాన్ ఒక గొప్ప రికార్డును క్రియేట్ చేస్తాడు.
ఇక ఇది షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం ఇప్పటికే రాజ్ కుమార్ హీరాని తన డైరెక్షన్ లో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్,లగెరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఇప్పుడు కూడా డంకి సినిమాతో మరోసారి తన సత్తాను చాటడానికి రెడీ అవుతున్నాడు…
ఇంత పెద్ద భారీ కాస్టింగ్ ఉన్న ఈ సినిమాను కేవలం 75 రోజుల్లో మాత్రమే షూటింగ్ కంప్లీట్ చేశాడు…
ఇక షారుక్ ఖాన్, తాప్సి ఇద్దరు కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం…తాప్సి బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా అవార్డులను కూడా గెలుచుకుంది…
సినిమా ఆర్టిస్టుల రేమ్యున్ రేశన్స్ కాకుండా సినిమా మొత్తాన్ని కేవలం 85 కోట్లతో మాత్రమే తెరకెక్కించాడు.ఇక ఆర్టిస్టుల అన్నీ కలుపుకుంటే ఈ సినిమా 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా తెలుస్తుంది… గత నాలుగు ,ఐదు ఏళ్లలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమాల్లో అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఇదే…
అయితే సినిమాకి మొదట ‘రిటర్న్ టికెట్’, టాస్ అనే టైటిల్స్ పెట్టాలి అని అనుకున్నారు కానీ డంకి అనే టైటిల్ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టారు… దేశ సరిహద్దుల నుండి అక్రమంగా ప్రయాణించడాన్ని ‘డాంకీ ట్రావెల్స్’ అంటారు.ఇక దాన్ని పంజాబ్ వాళ్ళు అయితే ‘డంకి’ అంటారు అందుకే ఆ పేరు పెట్టారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పేరిట డిసెంబర్ 21 వ తేదీ న ఒక్కరోజే 5 కోట్ల వరకు బిజినెస్ చేసింది…