https://oktelugu.com/

Baahubali 2: మాహిష్మతి ఊహాతీతం.. రాజమౌళి మేరునగం..ఆరేళ్ళ బాహుబలి_ 2 రికార్డులు మీకు తెలుసా?

బాహుబలికి ముందు తెలుగు సినిమా మార్కెట్ మహా అయితే 200 కోట్లలోపు ఉండేది. ఈ సినిమా ఏకంగా కుంభస్థలాన్ని కొల్లగొట్టింది. 1000 కోట్ల క్లబ్ ను అవలీలగా చేరింది. అంతేకాదు ఇప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీ అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు బాహుబలి_2 పేరు మీద ఉండటం విశేషం. కాగా శుక్రవారంతో ఈ సినిమా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Written By: Rocky, Updated On : April 28, 2023 5:15 pm
Follow us on

Baahubali 2: “బాహుబలి_2” ఏ ముహూర్తాన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించాడో, ఏ రోజున రాజమౌళి ఈ సినిమా తీశాడో కానీ.. సరికొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా తెలుగు సినిమాకి బాహుబలికి ముందు తర్వాత అనే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలామంది నిర్మాతలు ధైర్యంగా ముందుకొచ్చి వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అంతకుమించిన రాబడి సొంతం చేసుకుంటున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు మన సినిమాలను చిన్నచూపు చూసిన బాలీవుడ్ కూడా బాహుబలికి సాగిలపడింది. అంతేకాదు ఈ సినిమాతో రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కించుకున్నాడు అంటే దానికి పునాది వేసింది బాహుబలి.

ఏకంగా 1000 కోట్లు దాటింది

బాహుబలికి ముందు తెలుగు సినిమా మార్కెట్ మహా అయితే 200 కోట్లలోపు ఉండేది. ఈ సినిమా ఏకంగా కుంభస్థలాన్ని కొల్లగొట్టింది. 1000 కోట్ల క్లబ్ ను అవలీలగా చేరింది. అంతేకాదు ఇప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీ అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు బాహుబలి_2 పేరు మీద ఉండటం విశేషం. కాగా శుక్రవారంతో ఈ సినిమా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది అన్ని సెంటర్లలో రికార్డు స్థాయిలో వసూళ్ళు సాధించింది.

ఇవీ వసూళ్ల లెక్కలు

నైజాం 66.90 కోట్లు, సీడెడ్ 34.78 కోట్లు, ఉత్తరాంధ్ర 26.47 కోట్లు, ఈస్ట్ 17.04 కోట్లు, వెస్ట్ 12.31 కోట్లు, గుంటూరు 18.01 కోట్లు, కృష్ణా 14.10 కోట్లు, నెల్లూరు 8.04 కోట్లు కొల్లగొట్టింది. ఏపీ+ తెలంగాణ కలిపి 197.65 కోట్ల వసూళ్లు సాధించింది.. ఇక కర్ణాటకలో 62, తమిళనాడులో 81, కేరళలో 32.12, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 281.05 కోట్లు, ఓవర్సీస్ 160.28 కోట్లు, వరల్డ్ వైడ్ 814.10 కోట్ల వసూళ్లు సాధించింది.

350 కోట్ల బిజినెస్

బాహుబలి_ 2 కు అప్పట్లో 350 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంత వసూళ్లు సాధ్యమవుతాయా అని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత సృష్టించిన ప్రభంజనం అంతా అంతా కాదు. ఏకంగా నిర్మాతలకు 450 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. కేవలం థియేట్రికల్ కలెక్షన్ల రూపంలోనే 814 కోట్లకు పైగా వచ్చాయి. 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తీశాడు. ఇది కూడా ఆయన స్థాయిని అమాంతం పెంచేసింది. ఏకంగా అంతర్జాతీయ దర్శకుడిని చేసేసింది. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా పనిలో నిమగ్నమై ఉన్నారు.

 

Baahubali 2 - The Conclusion Trailer | Prabhas, Rana Daggubati | SS Rajamouli