https://oktelugu.com/

Salman Khan VS Vivek Oberoi: ఆ స్టార్ హీరోయిన్ కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోలు, ఆమె అంత అందగత్తె మరి!

ఓ స్టార్ హీరోయిన్ కోసం ఇద్దరు పోటీ పడ్డారు. ఆమె ప్రేమను పొందేందుకు తపించారు. ఈ క్రమంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. బాలీవుడ్ ని ఊపేసిన వరుస పరిణామాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : September 18, 2024 / 02:46 PM IST

    Salman Khan VS Vivek Oberoi

    Follow us on

    Salman Khan VS Vivek Oberoi: ఒక హీరోయిన్ ప్రేమ కోసం తన కెరీర్ ని నాశనం చేసుకున్నాడు ఓ హీరో. పరిశ్రమలోకి వస్తూనే దేశం మెచ్చిన హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు. ఆమె ఐశ్వర్య రాయ్ కాగా, సదరు హీరో వివేక్ ఒబెరాయ్. ఇక ఐశ్వర్య రాయ్ కోసం వివేక్ ఒబెరాయ్ తో గొడవకు దిగిన హీరో సల్మాన్ ఖాన్, ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీలో ఏం జరిగిందో చూద్దాం. సురేష్ ఒబెరాయ్ నట వారసుడిగా వివేక్ ఒబెరాయ్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. హీరోగా నిలదొక్కుకునే రోజుల్లోనే వివేక్ ఒబెరాయ్ ప్రేమలో పడ్డాడు.

    మిలీనియం ఆరంభంలో ఐశ్వర్య రాయ్-వివేక్ ఒబెరాయ్ ప్రేమలో పడ్డాడు. 2002లో విడుదలైన కంపెనీ చిత్రంతో వివేక్ ఒబెరాయ్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఐశ్వర్య రాయ్ అప్పటికే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమ బంధాన్ని వీరు ప్రకటించారు. తరచుగా పార్టీలు, పబ్స్ లో దర్శనం ఇచ్చేవారు. అదే సమయంలో ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ తో కూడా సన్నిహితంగా కనిపించేది. దాంతో వివేక్ ఒబెరాయ్ వారిద్దరి మీద ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో వివేక్ ఒబెరాయ్ తో ఐశ్వర్యకు దూరం పెరిగింది.

    వివేక్ ఒబెరాయ్ తో బ్రేకప్ అనంతరం సల్మాన్ ఖాన్ కి ఐశ్వర్య దగ్గరైనట్లు సమాచారం. వివేక్ ఒబెరాయ్ ని సల్మాన్ ఖాన్ బెదిరించాడట. వివేక్ ఒబెరాయ్ కెరీర్ నాశనం కావడం వెనుక ఐశ్వర్య రాయ్ తో లవ్ ఎఫైర్ కూడా కారణం అనే వాదన ఉంది. కొన్నాళ్ళు సల్మాన్-ఐశ్వర్య చెట్టపట్టాలేసుకుని తిరిగారు. అయితే సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ పై వేధింపులకు పాల్పడ్డాడనే వాదన ఉంది.

    అర్ధరాత్రి తాగి సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ఇంటి ముందు నానా రచ్చ చేశాడట. సల్మాన్ ఖాన్ ప్రవర్తనతో విసిగిపోయిన ఐశ్యర్య రాయ్ అతడికి బ్రేకప్ చెప్పిందట. ఐశ్యర్య రాయ్ ప్రేమ కోసం సల్మాన్-వివేక్ ఒబెరాయ్ కొట్టుకున్నారు అనేది మాత్రం నిజం. స్టార్ హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్ వివేక్ ఒబెరాయ్ కెరీర్ ని దెబ్బ తీశాడనే వాదన ఉంది.

    ఇక సల్మాన్ ఖాన్ కి కూడా హ్యాండ్ ఇచ్చిన ఐశ్యర్య రాయ్.. అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడింది. ఐశ్యర్య రాయ్-అభిషేక్ బచ్చన్ కొన్ని చిత్రాల్లో జంటగా నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2007లో అభిషేక్ బచ్చన్-ఐశ్యర్య రాయ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. పేరు ఆరాధ్య. ఇటీవల ఐశ్యర్య-అభిషేక్ విడిపోయారనే వార్తలు వచ్చాయి.

    ఆసియాలోనే అతిపెద్డ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు ఐశ్యర్య రాయ్ తన కూతురితో పాటు సింగిల్ గా హాజరైంది. ఇక అభిషేక్ బచ్చన్… పేరెంట్స్ అమితాబ్, జయా బచ్చన్ లతో హాజరయ్యాడు. ఈ పరిణామం మరింతగా అనుమానాలు బలపడేలా చేసింది. తిరిగి కలిసి కనిపించిన ఈ జంట రూమర్స్ కి చెక్ పెట్టారు.