SV Krishna Reddy: ఒకప్పుడు ఫ్యామిలీ మూవీస్ చేసి తనకంటూ ఒక గొప్ప క్రెడిబిలిటీని సంపాదించుకున్న దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి…అతని నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులందరు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. అలాగే ఆయన సినిమాలో సిచువేషనల్ కామెడీ ఉండేది. ఫ్యామిలీ మొత్తాన్ని అలరించే విధంగా ఆయన సినిమాలు ఉండేవి. అందువల్లే ఆయన కోసం స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయడానికి అసక్తి చూపించేవారు… గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయినప్పటికి ఆయన అప్పుడు మరో కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేశాడు. ఇక గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అచ్చిరెడ్డి చెప్పిన మాటని ఒకసారి గుర్తు చేసుకున్నాడు…
మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్లకి బుధవారం నాడు ఇస్తానని చెప్పి మనం ఆదివారం నాడే వాళ్లకు డబ్బులు ఇచ్చినట్టయితే వాళ్లు సంతోషిస్తారు. ఒకవేళ రెండు రోజులు ముందు చెప్పి రెండు రోజులు లేటుగా ఇస్తే వాళ్ళు తిట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి ఒక స్ట్రాటజీని మెయింటైన్ చెయ్ అని చెప్పారట. అందుకే వాళ్లకు ఒక నాలుగు రోజులు డేట్ చెప్పి రెండు రోజుల్లోపే అతను డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడట.
అందువల్లే ఇండస్ట్రీలో తనకు మంచి క్రెడిబిలిటీ వచ్చిందని చాలా మంది అదేంటి నాలుగు రోజులకు ఇస్తానని చెప్పి రెండు రోజులకే ఇస్తున్నావ్ అంటూ ఆశ్చర్యపోయేవారని ఆయన చెప్పడం విశేషం…ఇక అలాగే ఆయన మొదట రైటర్ గా చేసిన కొబ్బరి మట్టం సినిమా సూపర్ సక్సెస్ ని సాధించిందని ఆ సినిమాకి వచ్చిన ప్రాఫిట్స్ ని తను డైరెక్టర్ గా మారడానికి ప్రమోషన్స్ లాగా వాడుకున్నానని ఎస్వి కృష్ణారెడ్డి చెప్పారు… మొత్తానికైతే ఈ లెజెండరీ డైరెక్టర్ నుంచి ఇప్పుడు రాబోయే సినిమా మంచి విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసినట్లయితే మాత్రం ఆయన టాప్ లెవెల్ కి వెళ్ళిపోతాడు.
తనను తాను మరోసారి టాప్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…గతంలో ఆయన శ్రీకాంత్, జగపతిబాబు లాంటి హీరోలతో వరుస సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు…