Bajaj Platinum Bike : 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ టూవీలర్స్ గురించి తెలుసా?

ద్విచక్ర వాహనం ఎక్కువగా మైలేజ్ ఇవ్వాలంటే దాని చక్రాలు సన్నగా ఉండాలి. అలాగే లైట్ వెయిట్ తో ఉండాలి. ఈ రకమైన లక్షణాలు బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినం 100 బైక్ లో కనిపిస్తాయి. 2006లో మార్కెట్లోకి వచ్చింది. 2007 సెప్టెంబర్ వరకు ప్రతి నెల 35 వేల యూనిట్లు అమ్ముడు పోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బైక్ కు ఆదరణ తగ్గడం లేదు.

Written By: Srinivas, Updated On : October 14, 2024 3:42 pm

Bajaj Platinum Bike

Follow us on

Bajaj Platinum Bike :  మధ్యతరగతి ఇంట్లో ప్రయాణాలు చేయడానికి టూవీలర్ ప్రధానమైనది. దీంతో కార్యాలయాల అవసరాలతో పాటు ఇతర లాంగ్ జర్నీ చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి. టూ వీలర్ కొనే ముందు చాలా మంది ఆలోచించేది మైలేజ్ గురించి. అయితే కొన్ని స్పోర్ట్స్ వేరియంట్ బైక్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మైలేజ్ తక్కువగా ఇస్తాయి. మరికొన్ని బైక్ లు సాధారణంగా కనిపించినా ఇవి మైలేజ్ మహారాజుల్లాగా ఉంటాయి. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా మైలేజ్ ఇచ్చే వాహనాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. దీంతో అలాంటి టూ వీలర్స్ ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటాయి. అయితే కొన్నేళ్ల కిందటే మార్కెట్లోకి వచ్చిన రెండు వాహనాలు ఇప్పటికీ మంచి మైలేజ్ ఇచ్చే బైక్ లుగా నిలుస్తున్నాయి. వీటి తరువాత ఎన్ని వాహనాలు మార్కెట్లోకి వచ్చినా.. వాటిని మాత్రం బీట్ చేయడం లేదు. లీటర్ పెట్రోల్ కు 70 కిలోమీటర్లు ఇచ్చే ఈ వాహనాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

ద్విచక్ర వాహనం ఎక్కువగా మైలేజ్ ఇవ్వాలంటే దాని చక్రాలు సన్నగా ఉండాలి. అలాగే లైట్ వెయిట్ తో ఉండాలి. ఈ రకమైన లక్షణాలు బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినం 100 బైక్ లో కనిపిస్తాయి. 2006లో మార్కెట్లోకి వచ్చింది. 2007 సెప్టెంబర్ వరకు ప్రతి నెల 35 వేల యూనిట్లు అమ్ముడు పోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బైక్ కు ఆదరణ తగ్గడం లేదు. మైలేజ్ కావాలనుకునే వారు ఎక్కువ శాతం ప్లాటినం వైపే చూసేవారు. బజాజ్ ప్లాటినం బైక్ లో 102 సీసీ ఇంజిన్ ఉండనుంది. ఇందులో సింగిల్ సిలిండర్ డీటీఎస్ ఐ ఇంజిన్, తో పాటు 7.79 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 8.34 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ బైక్ ప్లాట్ సీటును కలిగి ఉంటుంది. ఇది లీటర్ 72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ధర రూ.68,685తో విక్రయిస్తున్నారు.

దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మరో బైక్ టీవీఎస్ స్పోర్ట్స్. 2007లో మార్కెట్ోలకి వచ్చిన ఈ బైక్ కు ఆదరణ అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గడం లేదు. ఇందులో 108.7 సీసీ ఇంజిన్ తో పాటు సింగిల్ సిలిండర్ తో ఉంటుంది. ఇందులో 8.07 బీహెచ్ పీ పవర్ తో పాటు 8.4 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్ కూల్డ్ బీఎస్ 6 ఇంజిన్ కలిగిన ఈ బైక్ ముందు, వెనుక భాగంలో డ్రమ్స్ బ్రేక్స్ ఉంటాయి. ఇది లీటర్ కు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 10 లీటర్ల ఫ్యూయెల్ అవసరమయ్యే ట్యాంక్ ఉంది. దీనిని రూ. 62, 625కు విక్రయిస్తున్నారు.

100 సీసీ ఇంజిన్ బైక్ కావాలనుకునేవారు ఈ రెండు బైక్ లు బెస్ట్ అప్షన్ గా ఉంటున్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ ఎక్కువ మైలేజ్ ఇస్తుంటాయి. ప్రస్తుతం ఎటువంటి బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకున్నా.. రూ. లక్షకు పైగానే ఉంటుంది. అంతేకాకుండా 70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్ లు మార్కెట్లో తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బైక్ లు వాటికి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.