https://oktelugu.com/

Salaar: కెజిఎఫ్ లో భాగమే సలార్… ఫస్ట్ హాఫ్ మొత్తం విలన్ దే, మైండ్ బ్లోయింగ్ డిటైల్స్!

ఆల్రెడీ $500K వసూళ్లను దాటేసింది. ఓపెనింగ్ డే సలార్ రూ. 200 కోట్ల వసూళ్లను ఈజీగా అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : August 30, 2023 / 09:19 AM IST

    Salaar

    Follow us on

    Salaar: హీరో ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఇందుకు కాంబినేషన్ కారణమైంది. కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా అవతరించాడు. అలాంటి దర్శకుడు ప్రభాస్ వంటి మాస్ పాన్ ఇండియా హీరోతో చేస్తున్న మూవీ ఆకాశమే హద్దుగా ఉంటుందని ప్రేక్షకుల అంచనా. సలార్ చిత్రానికి ఎంతటి క్రేజ్ ఉందో చెప్పేందుకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ నిదర్శనం. ఇక యూఎస్ లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

    ఆల్రెడీ $500K వసూళ్లను దాటేసింది. ఓపెనింగ్ డే సలార్ రూ. 200 కోట్ల వసూళ్లను ఈజీగా అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. సలార్ కూడా కెజిఎఫ్ కథలో భాగమే అంటున్నారు. ఈ మాట మొదటి నుండి వినిపిస్తున్నా సలార్ యూనిట్ స్పష్టత ఇవ్వడం లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కెజిఎఫ్ యూనివర్స్ లో భాగంగా సలార్ తెరకెక్కిందట.

    సలార్ లో విలన్ గా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ చేస్తున్నారు. ఆయనకు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఉంటుందట. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పృథ్విరాజ్ మీదే నడుస్తుందట. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ విజృభిస్తాడట. ఒక సలార్ కి మరికొన్ని పార్ట్స్ ఉంటాయట. సలార్ 2 ఉంది. పార్ట్ 1లో నా పాత్రకు పెద్దగా స్పేస్ లేదని జగపతిబాబు స్వయంగా చెప్పారు. సలార్ 2లో నా పాత్ర నిడివి ఎక్కువ అన్నారు.

    అలాగే సలార్ టీజర్ దీనిపై హింట్ ఇచ్చింది. కెజిఎఫ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు సలార్ టీజర్లో ఉన్నాయి. కాబట్టి సందేహమే లేదు. కెజిఎఫ్ కథలో భాగంగా సలార్ తెరకెక్కుతోందని టాలీవుడ్ వర్గాల వాదన. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.